Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Dec-2017 11:50:58
facebook Twitter Googleplus
Photo

ఎన్నో విజయాలను అందుకుని.. తనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకుని.. తన మ్యూజిక్ తో ఉర్రూతలూగిస్తున్న యంగ్ కంపోజర్ అనిరుధ్.. ఇప్పుడు అజ్ఞాతవాసి సినిమాతో తెలుగులోకి అడుగుపెడుతున్నాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చాలా గ్రేట్.. త్రివిక్రమ్ నాకు గురూజీ అంటూ కామెంట్లు చేస్తున్న ఈ కుర్రాడు.. ఇప్పుడు పవన్ పాతిక సినిమాలను తన కొత్త పాటతో ఒకసారి గుర్తు చేయాలని ప్రయత్నిస్తున్నాడు.

నిన్న రిలీజైన రెండో సింగిల్ గాలి వాలుగా.. గులాభి తాకి అనే పాట ఉంది చూశారూ.. ఆ పాటకు ఇప్పుడు విజువల్ రూపం ఒకటి ఇచ్చాడు. కొన్ని పాత భవనాలు మధ్యలో.. గాలి వాలుగా పాటను తానే పాడుతూ.. ఆ గోడలపై ఉన్న పవన్ బొమ్మలను చూపిస్తూ.. అలా కెమెరా పాస్ అవుతున్నప్పుడు ఆ సినిమాల తాలూకు టైటిళ్లను ఫ్లాషింగ్ చేయిస్తూ.. అబ్బో విజువల్ గా చాలా ఇంప్రెస్ చేశాడు అనిరుధ్. ఈ పాటను పూర్తిగా తన ఆధ్వర్యంలో చెన్నయ్ లోనే తీయించాడట. పాటను చూసి వావ్ ఒక రేంజులో నీ అభిమానం చాటుకున్నావ్ అంటూ త్రివిక్రమ్ కూడా భుజం తట్టాడట.

ఇక పాటను చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా వావ్ అంటున్నారు.

,  ,  ,  ,  ,  ,