Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Apr-2016 16:38:56
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న సర్దార్ గబ్బర్ సింగ్ ప్రస్తుతం తెలుగు సినీ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోన్న సినిమా. భారీ అంచనాల నడుమ మరో రెండు రోజుల్లో థియేటర్ల ముందుకు వచ్చేస్తోన్న ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించిన ప్రతీ అంశం సంచలనంగా మారిపోయింది. బాహుబలి లాంటి ఇండియన్ సినిమా ప్రభంజనం తర్వాత తెలుగులో ఆ స్థాయి రిలీజ్‌కు సిద్ధమైన సర్దార్, థియేటర్ల కౌంట్ పరంగా సంచలనమే సృష్టిస్తోంది. ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమా సుమారు 384 థియేటర్లలో విడుదల కానుంది.
ఒక స్టార్ హీరో సినిమా అంటే సాధారణంగా ఉండే క్రేజ్ దృష్ట్యా చూస్తే, ఇన్ని థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా ప్రభంజనమే సృష్టిస్తుందని ట్రేడ్ టాక్. హిట్ టాక్ వచ్చి మొదటి వారమంతా హౌస్‌ఫుల్స్‌తో నడిస్తే మొదటివారం సినిమా 17 కోట్ల రూపాయల వరకూ కలెక్షన్స్ వసూళ్ళు చేయగలదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శరత్ మరార్ నిర్మించగా, కాజల్ సినిమాలో హీరోయిన్‌గా నటించారు

,  ,  ,  ,  ,