Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Jan-2017 11:27:27
facebook Twitter Googleplus
Photo

గీతాంజలి అంటూ సోలోగానే సక్సెస్ సాధించిన తర్వాత తెలుగమ్మాయి అంజలికి అలాంటి సినిమాలు వరుసపెట్టి క్యూ కట్టేశాయి. అన్నిటినీ కాకపోయినా.. చిత్రాంగద అనే మూవీని చేసింది అంజలి. కొన్ని నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సంగతులు వినిపించడం మానేశాయి.

పిల్ల జమీందార్ ఫేం దర్శకుడు అశోక్ చిత్రాంగద మూవీని తెరకెక్కించాడు. ఇప్పుడీ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా లాక్ చేసుకున్నారట. ఫిబ్రవరి 10న చిత్రాంగదను రిలీజ్ చేసేందుకు నిర్మాత గంగపట్నం శ్రీధర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మూవీలో టైటిల్ రోల్ ను అంజలి పోషించగా.. హారర్ జోనర్ లో తెరకెక్కింది. కొన్ని సాంకేతిక కారణాలతో రిలీజ్ లేట్ అయినా.. సినిమా సక్సెస్ పై నమ్మకంగా ఉన్నామని చెబుతున్నారు దర్శక నిర్మాతలు.

ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోగా.. హారర్ తో పాటు సైకో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయట. తెలుగులో చివరగా సరైనోడు మూవీలో అల్లు అర్జున్ తో కలిసి 'బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టరే' అంటూ ఐటెం సాంగ్ లో కనిపించింది అంజలి. అయితే.. హారర్ థ్రిల్లర్ సినిమాల్లో కంటెంట్ బాగుంటే.. సీజన్ తో సంబంధం లేకుండా ఆడేసే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. తెలుగులో చిత్రాంగద టైటిల్ తోను.. తమిళ్ లో యార్ నీ పేరుతోను ఒకేసారి ఈ మూవీని తెరకెక్కించారు.

,  ,  ,  ,  ,  ,