Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jun-2015 11:38:16
facebook Twitter Googleplus
Photo

పోటీని తట్టుకోవాలంటే అందుకు తగ్గట్టుగా సన్నద్ధమవ్వాలి. ముఖ్యంగా ఈ విషయంలో హీరోయిన్లు అయితే, ముందుగా తమ గ్లామర్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ, మరింత అందంగా మెరిసిపోతూ వుండాలి. అందుకోసం ప్రధానంగా శరీరాకృతిని అదుపులో వుంచుకోవాలి. అందుకే, మన హీరోయిన్లు డైటింగులు, ఎక్సర్ సైజులు అంటూ కష్టపడుతుంటారు. నిన్నటి దాకా బొద్దుగుమ్మ అనిపించుకున్న టాలీవుడ్ తాజా అందం రాశీఖన్నా కూడా ఇది గ్రహించింది. ఎవరూ తనని కామెంట్ చేయకుండానే జాగ్రత్తపడిపోయింది. ఆమధ్య హరిద్వార్ లోని ఓ స్పాలో ట్రీట్ మెంట్ తీసుకుని ఏకంగా ఆరు కిలోల బరువు తగ్గిందట. మెడిటేషన్, యోగా, డైటింగ్ లతో బాటు జిమ్ లో కూడా వర్కౌట్స్ చేసి తన వెయిట్ తగ్గించుకుంది. ఇప్పుడు మళ్లీ పెరగకుండా, వీలయితే మరికాస్త తగ్గించుకునేలా తన బాడీపై ఓ కన్ను వేసిందట!

,  ,  ,  ,