Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Feb-2015 10:44:20
facebook Twitter Googleplus
Photo

అందాల అంజలి ఇప్పుడు తన గెటప్ మార్చి, న్యాయవాది అవతారం ఎత్తింది. తమిళంలో తన సెకండ్ ఇన్నింగ్సులో చేస్తున్న రెండో సినిమా 'మాపిళ్ళయ్ సింగం'లో ఈ చిన్నది ఇలా లాయర్ వేషంలో కనిపించనుంది. ఇందులో యువనటుడు విమల్ హీరోగా నటిస్తున్నాడు. ఇది గ్రామీణ వాతావరణంలో సాగే కథా చిత్రమనీ, అయితే అంజలి అనూహ్యంగా లాయర్ అవతారమెత్తుతుందనీ చెబుతున్నారు. నల్లకోటు వేసుకుని కోర్టులో ఆమె చేసే వాదనలకు సంబంధించిన సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయట. రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నటిగా తనకు మంచి పేరు తెస్తుందని ఈ ముద్దుగుమ్మ ఆశలు పెట్టుకుంది.

,  ,  ,  ,