Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jun-2016 14:53:09
facebook Twitter Googleplus
Photo

మిల్కీ బ్యూటీ తమన్నా తన ట్యాలెంట్ అంతా చూపించేస్తోంది. ఇప్పటివరకూ రకరకాల కేరక్టర్లతో ఫ్యాన్స్ ని మైమరపించిన తమ్మూ.. ఇప్పుడు అభినేత్రిగా ఆడియన్స్ ముందుకు రానుంది. ఎప్పటికప్పుడు ఏదో అప్ డేట్ ఇస్తూ.. ఈ మూవీ గురించి ఫ్యాన్స్ లో ఆసక్తి కలిగేలా చేయడంలో యూనిట్ బాగానే సక్సెస్ అవుతోంది. మూడు భాషల్లో తెరకెక్కుతున్న అభినేత్రిలో తమన్నా చుట్టూనే స్టోరీ తిరగనుండడం విశేషం.

ఎప్పడు చూసినా ఏ కేరక్టర్లో చూసినా ఏ టైంలో అయినా.. మిలమిలా మెరిసిపోవడం తమన్నా స్పెషాలిటీ. కానీ ఈ మూవీకి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ చూసి ఫ్యాన్స్ తెగ కంగారు పడిపోయారు. ప్రభుదేవా భార్యగా.. పనమ్మాయి టైపులో ఉన్న గెటప్ తో తమ్మూని చూడగానే.. చాలామంది అభిమానులు గుండెలు బాదేసుకున్నారు. మిల్కీ ఇలా అయిపోయిందేంటి? ఇలా అయితే సినిమా అంతా ఎలా చూడాలి? అని బెంగకూడా పెట్టేసుకున్నారు.

ఇక జనాలను మరీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని యూనిట్.. తమన్నా గ్లామర్ గెటప్ ని రివీల్ చేసింది. ఓ కొత్త పోస్టర్ లో గోల్డ్ కలర్ ఔట్ ఫిట్స్ తో మెరిసిపోతోంది తమన్నా. మెరుస్తున్న షోల్డర్స్ - కళకళలాడే క్లీవేజ్ ను ఎక్స్ పోజ్ చేస్తున్న తమ్మూను చూస్తే.. ఆ గోల్డ్ కలర్ డ్రస్ తో పోటీ పడుతున్నట్లుగా ఉంది. అన్నీ బాగానే ఉన్నాయ్ కానీ.. మిల్కీ పక్కన జేబులో ఓ గన్ దోపుకుని.. సోనూసూద్ హీరో గెటప్ లో కనిపించడం చూసి.. మళ్లీ ఫ్యాన్స్ లో వర్రీ స్టార్ట్ అయిపోయింది.

అభినేత్రిలో అన్నిటికీ మించి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే.. తమన్నా ఈ సినిమాలో డ్యుయల్ రోల్ చేస్తోందని తెలుస్తోంది. అంటే పనిపిల్ల గెటప్ లో ఉండే తమ్మూ వేరు.. ఈ హీరోయిన్ అభినేత్రి వేరు అన్నమాట. అదీ కథ.

,  ,  ,  ,  ,  ,  ,