Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Nov-2015 14:47:55
facebook Twitter Googleplus
Photo

బన్ని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆన్ సెట్స్ ఉందీ సినిమా. ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని ఇన్ టైమ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన. మెజారిటీ భాగం టాకీ పూర్తయింది. అయితే బన్ని సినిమాలో ఐటెమ్ నంబర్ తప్పనిసరి.

రింగ రింగ రింగ రింగ అంటూ ఆర్యలో ఐటెమ్ నంబర్ తో బన్ని స్టెప్పులు ఓ రేంజులో పాపులర్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు సరైనోడు చిత్రంలోనూ ఓ ఐటెమ్ నంబర్ ఉండాల్సిందేనని బోయపాటి పట్టుపడుతున్నాడు. అందుకు తగ్గట్టే స్వీటీ శెట్టి అనుష్క ఐటెమ్ నంబర్ లో నర్తించేందుకు అంగీకరించిందని ఇటీవలి కాలంలో ప్రచారమైంది. బన్ని స్వీటీ కోసం రుద్రమదేవి చిత్రంలో గోనగన్నారెడ్డి క్యారెక్టర్ చేసేందుకు ముందుకు వచ్చాడు... కాబట్టి అందుకు ప్రతిఫలంగా స్వీటీ ఇప్పుడు బన్ని సినిమాలో ఐటెమ్ నంబర్ చేసేందుకు అంగీకరించింది అంటూ ప్రచారం సాగించారు. అయితే ఇదేదీ నిజం కాదని తేలిపోయింది.

సరైనోడు చిత్రంలో అనుష్క ఐటెమ్ నంబర్ చేయడం లేదు. తనని ఇంతవరకూ ఎవరూ సంప్రదించిందే లేదు. తెలుగింటి సీతమ్మగా పాపులర్ అయిన అంజలి అయితే ఈ ఐటెమ్ నంబర్ కిక్కు తెస్తుందని మేకర్స్ భావిస్తున్నారుట. అంజలి ప్రస్తుతం శంకరాభరణం చిత్రంలో ఓ కీరోల్ పోషిస్తోంది. ఆ చిత్రంలోని వీడియో సాంగ్ లో అంజలి పెర్ఫామెన్స్ చూసి ఈ అవకాశం ఇచ్చారుట. అంటే అనుష్క ఐటెమ్ చేయదు. అంజలి చేయడం ఖాయం అని తేలిపోయినట్టే. అంజలి ప్రస్తుతం శంకరాభరణం - చిత్రాంగద సినిమాలతో బిజీగా ఉంది. తమిళ్ లోనూ కొన్ని ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి.

,  ,  ,  ,  ,