Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jun-2015 17:06:21
facebook Twitter Googleplus
Photo

నిఖిల్‌ హీరోగా కోన వెంకట్‌ సమర్పణలో రూపొందుతోన్న 'శంకరాభరణం' చిత్రంలో అంజలి ఒక చిన్న పాత్రలో మెరుస్తుందని తెలిసింది. తనకి సోలో హీరోయిన్‌గా పెద్ద హిట్‌ ఇచ్చిన గీతాంజలి చిత్రంలో తనకి అవకాశం రావడంలో కోన వెంకట్‌ కీలక పాత్ర పోషించడంతో ఇప్పుడు దానికి ప్రతిగా తన కృతజ్ఞతని ఈ చిన్న పాత్ర చేస్తూ చాటుకుంటోంది అంజలి. ఈ పాత్ర కనిపించేది కాసేపే అయినా చాలా స్పెషల్‌గా వుంటుందని, అందుకని పేరున్న హీరోయిన్‌తో చేయిస్తే బావుంటుందని అనుకుని అంజలిని అడిగారట. ఆమె కోన వెంకట్‌ సినిమా అనగానే ఓకే చెప్పేసిందట.

ఇందులో అంజలి చేసే పాత్ర డెకాయిట్‌ అని సమాచారం. శంకరాభరణం అనే టైటిల్‌తో క్రైమ్‌ కామెడీ తీయడమే ఆడియన్స్‌కి కొత్త అనుభూతిని ఇస్తుందని, స్వామిరారా మాదిరిగా నిఖిల్‌కి ఇది మరో గుర్తుండిపోయే చిత్రమవుతుందని కోన వెంకట్‌ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు. గీతాంజలి ఘన విజయం సాధించడంతో కోన వెంకట్‌ నిర్మాణ భాగస్వామిగా వున్న శంకరాభరణంపై కూడా ట్రేడ్‌లో మంచి బజ్‌ వుంది. ఈ చిత్రానికి బిజినెస్‌ బాగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

,  ,