Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jun-2017 14:37:29
facebook Twitter Googleplus
Photo

సినిమాలలో సక్సెస్ రెండు రకాలు. ఒకటి సింగల్ సినిమా తో హిట్ కొట్టి ఫేమస్ కావడం. రెండోది కొన్నాళ్ళ శ్రమకు నెమ్మదినెమ్మదిగా గుర్తింపు పెరిగి స్టార్ కావడం. ఎవరికి ఎలా ఉన్న కొంత మందికి ఈ సింగల్ సినిమా హిట్లు బాగానే కలిసి వస్తాయి. ఉదాహరణకు ఇప్పుడు స్టార్ హీరోయిన్ సమంత కూడా ఏం మాయ చేసావే తో ఒక లైఫ్ టైమ్ కు సరిపడా ఆఫర్లు తెచ్చుకుంది. ఇప్పుడు అలాగే మరో క్యూట్ అండ్ బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ కూడా అదే బాటలో నడుస్తుంది.

ప్రేమమ్ సినిమాతో మొత్తం సౌత్ ఇండియాలో ఒకసారిగా క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మాయి ఈ మధ్యనే ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంటికి తనకు జీవితాన్ని ఇచ్చిన సినిమా పేరు పెట్టుకుంది. తన ఆనందాన్ని కొత్త ఇంటి విశేషాలను ఇలా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులుతో పంచుకుంది. ''రెండు ఏళ్ళు కిందట నా జీవితం లో ఒక మిరాకిల్ జరిగింది. ప్రేమమ్ నా జీవితాన్ని నా గమ్యాన్ని పూర్తిగా మార్చేసింది. అందుకే ఇప్పుడు నా కొత్త ఇంటికి ప్రేమమ్ కన్నా గొప్ప పేరు మరేది కనిపించలేదు” అని పోస్ట్ చేసింది అమ్మడు. ఇక కొత్త ఇల్లు ప్రేమమ్ గృహ ప్రవేశం చేసి తన ఆనందాన్ని ఇలా అందరితో షేర్ చేసింది.

అదే సినిమాను తెలుగులో కూడా ప్రేమమ్ టైటిల్ తో నిర్మించి మంచి విజయం దక్కించుకుంది. ఆ తరవాత శతమానం భవతి సుకెస్స్ తో ఇప్పుడు మరిన్ని తెలుగు సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పుడు సౌత్ ఫిల్మ్ మేకర్స్ అందరూ అనుపమ పై ఫోకస్ చేశారు

,  ,  ,  ,  ,