Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Oct-2015 15:08:45
facebook Twitter Googleplus
Photo

అప్ కమింగ్ హీరో నుంచి మినిమం గ్యారంటీ హీరోగా మారి.. స్టార్ రేసులో ఉన్నానంటున్నాడు రాజ్ తరుణ్. పెద్ద బ్యానర్లు తీసే చిన్న చిత్రాలకు ఫస్ట్ చాయిస్ గా రాజ్ తరుణ్ నే అనుకుంటున్నారు. ఈ వైజాగ్ కుర్రోడికి సినిమాలంటే చాలా ఇష్టం. గోపాలపట్నంలో సుకన్యా థియేటర్ లో ఎక్కువగా మూవీస్ చూసేవాడట రాజ్ తరుణ్.

టికెట్ల కోసం కౌంటర్ లో ఉన్న వ్యక్తితో ప్రతీసారి గొడవ పడాల్సి వచ్చేదట రాజ్ తరుణ్ కి. అప్పట్లో టికెట్స్ లేవు పొమ్మన్న వ్యక్తే.. ఇప్పుడు సక్సెస్ టూర్ కి వెళ్లినపుడు సాదరంగా ఆహ్వానించే పరిస్థితి వచ్చిందట. అదేంటీ అప్పడు పొమ్మన్నారు ఇప్పుడు రమ్మంటున్నారంటూ జోక్ చేశాడట కూడా. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ కుర్రహీరోకి మొదటి అవకాశం వచ్చిన తీరు తెలిస్తే.. మనకు ఆశ్చర్యం వేస్తుంది. మనకేంటి..రాజ్ తరుణ్ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చిందట. షార్ట్ ఫిలింస్ తీస్తూ.. అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం ఉయ్యాలా జంపాలా యూనిట్ తో జతయ్యాడట రాజ్ తరుణ్. చాలా మందిని అంటే 200 మందిని ఆడిషన్ చేసినా.. డైరెక్టర్ కి ఎవరూ నచ్చలేదు. అప్పుడ రాజ్ తరుణ్ ని పిలిచి పేపర్ డైలాగ్ పేపర్ ఇచ్చి చేయమన్నారట. అలా హీరో అయ్యానంటున్నాడు రాజ్ తరుణ్.

ప్రస్తుతం కుమారి 21 ఎఫ్ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న రాజ్ తరుణ్.. ఆ తరువాత మరో రెండు సినిమాలు కమిట్ అయ్యాడు. వరుసగా పెద్ద పెద్ద హిట్లు కొట్టి హీరోగా తన స్థానం సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నాడు.

,  ,  ,