Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-May-2017 11:44:23
facebook Twitter Googleplus
Photo

ఈ ఏడాది ఇప్పటివరకూ టాలీవుడ్ బ్యూటీ అనుష్క నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. నాగార్జున మూవీ ఓం నమో వేంకటేశాయ.. సూర్యతో సింగం.. ప్రభాస్ తో బాహుబలి చిత్రాలను విడుదల చేసింది అనుష్క. ‍ఒక ఏడాది తొలి నాలుగు నెలల్లో 3 సినిమాలను విడుదల చేయడం ఓ రికార్డ్ అని చెప్పాలి కానీ.. అనుష్కకు అలా కలిసొచ్చిందంతే.

ఇప్పుడు తన మరుసటి చిత్రాన్ని రిలీజ్ కి రెడీ చేసేస్తూ.. ఈ ఏడాది నాలుగో చిత్రాన్ని కూడా విడుదల చేసేయనుంది స్వీటీ. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అనుష్క నటించిన భాగమతి చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయిపోయింది. ఇప్పటికే అనుష్క పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీట్ కాగా.. గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నాయి. హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో లీడ్ రోల్ అనుష్కదే కావడం విశేషం. త్వరలో ఈ మూవీ ఫస్ట్ లుక్ ను ప్రభాస్ చేతులమీదుగా లాంఛ్ చేయించనున్నారు.

బాహుబలి2 ఫేమ్ ని క్యాష్ చేసుకునేందుకు.. భాగమతిని హిందీ.. తమిళ్.. మలయాళ భాషల్లో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.

,  ,  ,  ,  ,