Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Aug-2017 15:41:13
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినిమాలు కూడా పక్క రాష్ట్రాలలో విడుదలై మంచి మార్కెట్నీ సంపాదించాయి. తమిళ్ పెద్ద హీరోలు మలయాళం పెద్ద హీరోలు కొన్ని మంచి సినిమాలు మన తెలుగులోకి డబ్బింగ్ చేసి ఇక్కడ కూడా మంచి మార్కెట్ చేసిన పక్క రాష్ట్ర సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అలానే మనవాళ్లు కూడా అక్కడకు వెళ్ళి అదే పద్దతిని ఫాలో అయిపోతున్నారు. ఇప్పుడు యంగ్ హీరోలలో అల్లు అర్జున్ కి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా అర్జున్ స్టైలిష్ డాన్స్ అంటే అక్కడ పిచ్చ అభిమానం.

అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం తెలుగులో విడుదలై నెగెటివ్ టాక్ నుండి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కాకపోతే 72+ కోట్లు షేర్ వసూళ్ళు మాత్రం వచ్చేశాయి. యావరేజ్ టాక్ తో కూడా ఈ రేంజు వసూళ్ళు రావడం పంపిణీదారులను పూర్తిగా సేవ్ చేయలేదు కాని.. భారీగా నష్టాలకు మాత్రం గురిచేయలేదు. ఓవర్సీస్ లో ఎక్కువ నష్టం వచ్చింది. ఇక దువ్వాడ జగన్నాధం సినిమా కేరళలో ఆగష్టు 11 నాడు మలయాళంలో విడుదల చేశారు. అక్కడ కూడా యావరేజ్ రివ్యూలే వచ్చాయి. కాని ఆశ్చర్యపరుస్తూ మంచి ఓపెనింగ్స్ చేసింది. వీకెండ్ పూర్తి అయేసారికి 1.50 కోట్లు కలెక్షన్ చేసిందీ సినిమా. ఈ జోరు చూస్తుంటే అర్జున్ ముందు సినిమా సరైనోడు చేసిన కలెక్షన్ దాటుతుంది అని భావిస్తున్నారు ట్రేడ్ వర్గాలు. సరైనోడు సినిమా కేరలో 4 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా విడుదల కాస్త ఆలస్యం అయ్యింది కానీ లేకుంటే ఇంతకన్నా గొప్ప వసూలు చేయగలిగే సత్తా ఉంది దువ్వాడ జగన్నాధం కు అని చెప్పుకుంటున్నారు ఆ సినిమా టీమ్.

దువ్వాడ జగన్నాధం అక్కడ ధ్రువరాజ జగన్నాధ్ పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ డాన్స్ అతని యాక్షన్ కేరళ అభిమానులుకు బాగ నచ్చాయి అని చెబుతున్నారు.

,  ,  ,  ,  ,  ,