Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Apr-2015 10:41:51
facebook Twitter Googleplus
Photo

అప్పుడే నడుచుకుంటూ బయటికి వచ్చిన అజంతా శిల్పంలా కనిపించే కథానాయికగా అనుష్కను చెప్పుకోవచ్చు. అందమైన చందమామకైనా వంకపెట్టవచ్చునేమో గానీ .. అనుష్కకు వంకపెట్టలేమని సినీకవులు చెబుతుంటారు. అలాంటి అందచందాలతో పాటు అసమానమైన అభినయాన్ని కలిగి ఉండటం అనుష్క ప్రత్యేకత. అందుకే ఆమె ఇటు తెలుగులోనూ .. అటు తమిళ్ లోను బిజీ హీరోయిన్ గా వెలుగొందుతోంది. తాజాగా ఆమె 'సైజ్ జీరో' సినిమాలో నటిస్తోంది. తెలుగు .. తమిళ భాషల్లో అనుష్కకి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాను రెండు భాషల్లోను తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం తెలుగులో అత్యంత భారీ ప్రాజెక్టులుగా చెబుతోన్న 'బాహుబలి' ... 'రుద్రమదేవి' సినిమా షూటింగులు పూర్తికావడంతో, ఆమె ఈ సినిమాపై దృష్టిపెట్టింది. కోవెలమూడి ప్రకాష్ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో అనుష్క కొత్తగా కనిపిస్తుందని అంటున్నారు. వేగంగా జరుగుతోన్న ఈ సినిమా షూటింగులో ఆమె పాల్గొంటోంది. కొత్త కథానాయికలు ఎంతమంది వస్తున్నా, అందం .. అభినయం .. అదృష్టం కలగలిసిన తనని ఎదుర్కోవడం కష్టమైన పనేననే విషయాన్ని అనుష్క నిరూపిస్తోంది.

,  ,  ,  ,  ,  ,