Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Feb-2017 14:37:35
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో అందగత్తెలకు ఏమాత్రం కొదవ లేకపోయినా అనుష్క లాంటి అందగత్తె మాత్రం అరుదే. హైట్ వెయిట్ లో ఎక్కడా రేషియో తేడా లేకుండా సూపర్బ్ గా ఉండే ఈ సుందరి సినిమాల్లో కనిపించడం తగ్గించేసింది. చేసేవన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్టులే కావడంతో ఆరారగా మాత్రమే సినిమాలు వస్తున్నాయి. దీంతో అమ్మడు ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు కూడా. రీసెంటుగా ఆమెను చూస్తున్న సినీజనం మాత్రం అనుష్క మళ్లీ లావైపోయింది.. అయినా కత్తిలా ఉందని అంటున్నారు.

బక్కచిక్కినా బరువెక్కినా ఆకర్షణ అంటే అనుష్కదేనట. స్వీటీదే. అప్పట్లో సైజ్ జీరో కోసం బరువెక్కి?బాహుబలి రెండో భాగం కోసం సన్నబడింది. ఇప్పుడు మళ్లి లడ్డూలా మారిపోయింది. వంద శాతం అందాన్ని పోగేసుకుంది. ఇలా ఇంతలా గ్లామర్ పెంచడం కొత్త సినిమా కోసమేనా అనే సందేహం కలుగుతోంది. అందంపై అమితమైన శ్రద్ధ తీసుకునే అనుష్క..ఊరికే ఊరిపోదని అంటున్నారు.

సింగం 3? ట్రైలర్స్ లోనూ అనుష్క హెవీగానే కనిపిస్తోంది. ప్రస్తుతం అనుష్క నటించిన ?సింగం 3? బాహుబలి సినిమాలు పూర్తయ్యాయి. ఇక ఈ బ్యూటీ ఒప్పుకున్న సినిమా ?భాగమతి? ఒక్కటే. పిల్ల జమీందార్ చిత్ర దర్శకుడు అశోక్ రూపొందిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో ఖులీ కుతుబ్ షా ప్రేయసి భాగమతిగా అనుష్క నటిస్తోంది. సుల్తాను రాణి పాత్ర కోసం ఇలా ముద్దబంతిలా మారిపోయి ఉంటుందా అంటున్నారు. మొత్తానికి చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లుగా అనుష్క అడ్డంగా పెరిగినా అందమే అంటున్నారు ఆమె ఫ్యాన్సు.

,  ,  ,  ,  ,