Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Nov-2016 11:49:02
facebook Twitter Googleplus
Photo

కమెడియన్ శ్రీనివాస రెడ్డి అడపాదడపా హీరోగా కూడా చేస్తూ మెప్పించేస్తున్నాడు. ఇప్పటికే ఈ కమెడియన్ హీరోగా చేసిన గీతాంజలి సక్సెస్ కావడం కూడా ఓ స్థాయి హీరో పాత్రలకు ఆప్షన్ అయిపోతున్నాడు. ప్రస్తుతం జయమ్ము నిశ్చయమ్మురా మూవీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు శ్రీనివాస రెడ్డి. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండగా.. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది.

ఏరియాల వైజ్ గా జయమ్ము నిశ్చయమ్మురా మూవీని అమ్మిన రేట్లను పరిశీలిస్తే.. ఇప్పటికే సేఫ్ ప్రాజెక్ట్ అనేస్తున్నారు ట్రేడ్ జనాలు. తాజాగా నైజాం రైట్స్ ను ప్రొడ్యూసర్ కం డిస్ట్రిబ్యూటర్ అయిన సుధాకర్ రెడ్డి(హీరో నితిన్ తండ్రి) కొనుగోలు చేయడంతో.. ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. నైజాం రైట్స్ కోసం ఈ చిత్రానికి ఫ్యాన్స్ రేట్ నే ముట్టచెప్పారనే టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ లుక్ నుంచి మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రంలో శ్రీనివాస రెడ్డికి జోడీగా హీరోయిన్ పూర్ణ నటించింది.

తెలుగు ప్రజలంతా ఒకే రాష్ట్రంగా ఉన్న రోజుల్లో కరీంనగర్ నుంచి కాకినాడ వెళ్లిన ఓ కుర్రాడి చుట్టూ సాగిన సరదా సన్నివేశాల సమాహారమే ఈ చిత్రం అంటున్నాడు దర్శక నిర్మాత శివరాజ్ కనుమూరి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న జమయ్ము నిశ్చయమ్మురా చిత్రానికి నవంబర్ 5న టీజర్ ను దర్శకుడు సుకుమార్ చేతుల మీదుగా లాంఛ్ చేయించనున్నారు.

,  ,  ,  ,  ,