Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Oct-2015 17:57:09
facebook Twitter Googleplus
Photo

స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క శెట్టి ... పరిచయమే అక్కర్లేని పేరు ఇది. టాలీవుడ్ ని దశాబ్ధం పైగానే ఏలింది. ఇప్పటికీ ఏల్తూనే ఉంది. అరుంధతిగా - దేవసేనగా - రాణీ రుద్రమగా తెలుగు ప్రేక్షకుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. హిస్టరీలో తనకంటూ ఓ పేజీ క్రియేట్ చేసుకుంది ఈ భామ. అందుకే ఇప్పుడు ఏం మాట్లాడినా అనుష్క గురించే మాట్లాడుకుంటున్నారంతా. ఒకేసారి డిఫరెంట్ గెటప్పుల్లో డిఫరెంట్ ఆహార్యంతో ఆన్ సెట్స్ నటిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

రుద్రమదేవి 3డి సినిమాతో పాటు ప్యారలల్ గా సైజ్ జీరో సినిమాకి కూడా ప్రచారం చేసుకుంది అమ్మడు. ఒక లావుపాటి అమ్మాయి సైజ్ జీరోకి మారే క్రమంలో ఎలాంటి ఫన్ పుట్టింది అన్నదే ఈ సినిమా కాన్సెప్టు. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్.కె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం ఫ్యాట్ లేడీగా మారడానికి బాగా తిని లావెక్కింది అనుష్క. ఇప్పుడు ఆ బొద్దుతనంని తొలగించుకుని సైజ్ జీరోకి రావాలంటే చాలా కష్టమవుతోంది. జిమ్ములు - యోగా - ధ్యానం వంటివి సరిపోవడం లేదు. ఎట్టి పరిస్థితిలో అంతకుమించి .. ఇంకేదైనా చేయించాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు.

అందుకే ఎవరికీ చెప్పకుండా ఈ అమ్మడు విదేశాలు వెళ్లడానికి రెడీ అవుతోందని టాక్. అయితే అక్కడికి వెళ్లి లైఫో సక్సెమీ వంటి ట్రీట్ మెంట్ చేయించుకుంటుందా? లేక ఏదైనా స్పాట్రీట్ మెంట్ తో తిరిగి తన పాత రూపాన్ని తెచ్చుకుంటుందా? అన్నది తెలియాల్సి ఉందింకా. గతంలో ఈ న్యూస్ ఒక రూమర్ అని అనిపించింది కాని.. ఇప్పుడూ స్వీటీని చూస్తుంటే మాత్రం నిజమనే అంటున్నారు ఇన్సైడర్లు. చూద్దాం మరి.

,  ,  ,