Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Nov-2017 10:25:04
facebook Twitter Googleplus
Photo

హీరోయిన్ గా.. మెయిన్ లీడ్లో చేస్తున్న సినిమా భాగమతి. అరుంధతి వంటి సోలో సినిమాలను చేసిన అనుష్క.. ఈ సినిమాతో తన ఫ్యాన్స్ చాలా ఎక్సయిట్ చేసింది కాని.. గడిచిన రెండేళ్లలో అసలు ఫస్ట్ లుక్ అనేదే రాలేదు. ఎట్టకేలకు ఇప్పుడు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చింది. ఓవరాల్ థీమ్ ఎలా ఉన్నా..పోస్టర్ మాత్రం మనోళ్లను బాగా తికమక పెట్టేస్తోంది.

ఫక్తు కమర్షియల్ సినిమాల్లో మాస్ హీరో తరహాలో.. ఒక చేతిలో సుత్తి.. మరో చేతికి మధ్యలో గాయం.. అనుష్క మాత్రం ఒక ఫ్యాక్షన్ స్టార్ తరహాలో కనిపిస్తోంది ఇక్కడ. అయితే బ్యాగ్రౌండులో ఉన్న అమ్మాయి కాళ్లను చూస్తే.. క్రైస్తును గోడకు సిలువ వేసినట్లు.. ఇక్కడ కూడా ఎవరినో సిలువలో ఉంచినట్లున్నారు. అంతా బాగానే ఉంది కాని.. అసలు ఈ సినిమా థీమ్ ఏమైయుంటుంది? అనుష్క చేతిలో సుత్తి.. ఆ బ్లడ్.. అదంతా చూస్తుంటే ఇదేదో హారర్ సినిమా అని కూడా అనుకోవాలేమో. మరి ఇదో పీరియడ్ సినిమా అన్నారుగా అప్పట్లో.. అంటే సినిమాలో ఫ్లాష్ బ్యాక్ కతే ఆ గోడ మీద మనం చూస్తున్న బొమ్మా? లెటజ్ సీ.

చూస్తుంటే సినిమాలో ఏదో రివెంజ్ తీర్చుకునే థీమ్ కనిపిస్తోంది కాని.. అసలు అనుష్క ఆ పాత్రలో ఎంత వరకు మెప్పిస్తుంది అనేదే ధర్మసందేహం.

,  ,  ,  ,  ,