Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jun-2016 11:26:58
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ టాప్ బ్యూటీ అంటే రెండు మూడు పేర్లు గుర్తొచ్చినా.. చివరకు అందాల అనుష్క దగ్గరే సెర్చింగ్ ఆగుతుంది. అంతలా తెలుగు ఆడియన్స్ ను మైమరపించేసిన అనుష్క.. ఈ మధ్యనే ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన రుద్రమదేవి చిత్రానికి గాను.. స్వీటికి ఫిలింఫేర్ దక్కగా... ఈమెకు అన్ని వర్గాల నుంచి బోలెడన్ని ప్రశంసలు దక్కాయి.

?సైజ్ జీరో? కోసం కొంచెం బొద్దుగా మారినా.. స్వీటీ ఇప్పటికీ అందరికీ హాట్ ఫేవరేట్. మరి ఆమెకు అవార్డు వచ్చినందుకు.. తన సోదరుడు ఎలా ఫీలయ్యుంటాడు? దీనికి తనే ఆన్సర్ ఇచ్చాడు గుణరంజన్ శెట్టి. తన సోషల్ నెట్వర్కింగ్ పేజ్ లో.. తన చెల్లెలికి అవార్డు వచ్చినందుకుగాను అభినందనలు తెలిపాడు. 'అనుష్కకు - రుద్రమదేవి యూనిట్ కు కంగ్రాట్స్. ఇలాంటి విజయాలను ఇంకో ఎన్నో అందుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నారు. అనుష్క ఇండస్ట్రీలో కృషి - పట్టుపదల - అంకిత భావంతో పని చేస్తుంది.. అందుకే ఈ విజయం దక్కింది. నాకు చాలా గర్వంగా ఉంది' అంటూ పోస్ట్ చేశాడు అనుష్క బ్రదర్.

చాలామంది నుంచి చాలా రకాలుగా ప్రశంసలు వచ్చినా.. సోదరుడి నుంచి వచ్చిన అభినందనలకు.. స్వీటీ పొంగిపోయింది. ?థాంక్యూ బ్రో..? అంటూ అనుష్క తన బ్రదర్ కి థాంక్స్ చెబుతూ ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్టు చేసింది.

,  ,  ,  ,  ,  ,