Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Aug-2015 17:26:26
facebook Twitter Googleplus
Photo

తెలుగు ప్రేక్షకుల మదిలో జేజెమ్మగా గుర్తుండిపోయిన స్టార్ హీరోయిన్ అనుష్క ఇటీవలే బాహుబలి సినిమాలో ఓ డిఫరెంట్ గెటప్ లో కనిపించి ప్రేక్షకులను థ్రిల్ చేసింది. ఇలా థ్రిల్ చేసిన కొద్ది రోజులకే ఈ యోగ బ్యూటీ మరో డిఫరెంట్ సినిమాతో, మరో డిఫరెంట్ గెటప్ లో కనిపించి తెలుగు, తమిళ ఆడియన్స్ ని థ్రిల్ చెయ్యడానికి సిద్దమైంది. ఆ సినిమా పేరే ?సైజ్ జీరో?. సినిమా పేరులో సైజ్ జీరో అని ఉన్నా సినిమాలో అనుష్క మాత్రం అందుకు పూర్తి వ్యతిరేఖంగా బాగా బొద్దుగా కనిపించనుంది. ?అనగనగా ఓ ధీరుడు? సినిమాతో దర్శకుడిగా పరిచయం ఉన్న రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి ఈ సినిమాకి డైరెక్టర్. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
దాంతో ఈ చిత్ర టీం ఈ సినిమా కోసం ఓ ఆడియో రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు. మాకు అందిన సమాచారం ప్రకారం సైజ్ జీరో ఆడియో లాంచ్ సెప్టెంబర్ 6న మలేషియా రాజధాని అయిన కౌలాలాంపూర్ లో చాలా భారీ ఎత్తున చేయనున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ?రోబో? సినిమా ఆడియో లాంచ్ తర్వాత మరే సినిమా ఆడియో లాంచ్ కౌలాలాంపూర్ లో జరగలేదు. రోబో తర్వాత సైజ్ జీరో ఆడియో లాంచ్ అక్కడ జరగనుంది. ప్రకాష్ కోవెలమూడి చాలా గ్రాండ్ గా, చాలా డిఫరెంట్ గా ఈ ఆడియో లాంచ్ ని ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవలే రిలీజ్ చేసిన టైటిల్ లోగో పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగష్టు 15న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేయనున్నారు.
ఈ సినిమాలో అనుష్క రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనుంది. పివిపి సినిమాస్ బ్యానర్ లో పరమ్ వి పొట్లూరి నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ఆర్య, సోనాల్ చౌహాన్, భరత్, ఊర్వసి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ మూవీకి ప్రకాష్ కోవెలమూడి భార్య అయిన కనిన ధిల్లన్ కథ ? స్క్రీన్ ప్లే అందించింది

,  ,  ,