Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Nov-2017 16:08:24
facebook Twitter Googleplus
Photo

బ్రహ్మాజీ కెరీర్ నిలకడగానే ఉంది. మధ్యలో కొంతకాలం తడబడ్డా మళ్లీ ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అయ్యాడని చెప్పవచ్చు. సింధూరం లాంటి సినిమాలో హీరోగా నటించిన తర్వాత.. హీరో రోల్స్ కోసమే ఆగిపోలేదు ఈ నటుడు. తనకు వచ్చిన అన్ని రకాల పాత్రలను పోషిస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో బ్రహ్మాజీ చేసిన సుదీర్ఘమైన కామిక్ రోల్.. అందరినీ ఆకట్టుకుంది. జనతా గ్యారేజ్ లో సీరియస్ పాత్రలో ఈ యాక్టర్ మెప్పించిన తీరు అయితే కళ్లముందే మెదులుతూ ఉంటుంది. అటు కామెడీ.. ఇటు సీరియస్ పాత్రలను మెప్పించడంలో దిట్ట అయిన బ్రహ్మాజీ దగ్గరకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. చిన్నపాత్రల కోసం కూడా మేకర్స్ అప్రోచ్ అవుతున్నారు. జై లవకుశ మూవీలో ఎన్టీఆర్ పక్కన తక్కువ సీన్స్ లోనే కనిపించినా మెప్పించేశాడు. నెక్ట్స్ నువ్వే మూవీలో అయితే కీలకమైన పాత్రలో కనిపించాడు.

మెగా 151గా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం బ్రహ్మాజీని తీసుకున్నారట. పలువురు యాక్టర్లను పరిశీలించిన తర్వాత.. కథకు అతి ముఖ్యమైన ఈ పాత్రకు బ్రహ్మాజీనే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారట మేకర్స్. బ్రహ్మాజీ కెరీర్ కు ఈ చిత్రం టర్నింగ్ పాయింట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.

,