Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jul-2017 11:56:34
facebook Twitter Googleplus
Photo

నితిన్ తో చేస్తున్న సినిమాకు లై (lie).. అనే ఇంటరెస్టింగ్ టైటిల్ పెట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు యువ దర్శకుడు హను రాఘవపూడి. ఈ టైటిల్లోని మూడు ఇంగ్లిష్ అక్షరాలకు మూడు అర్థాలున్నాయి. ఎల్ అంటే లవ్.. ఐ అంటే ఇంటలిజెన్స్.. ఇ అంటే ఎనిమీ. ఇందులో ఆల్రెడీ లవ్ ను పరిచయం చేశారు. హీరోయిన్ మేఘా ఆకాశ్ లుక్ బయటికి వచ్చేసింది. రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది.

ఇప్పుడు రెండో అక్షరం దగ్గరికొచ్చారు. ఇంటలిజెన్స్ ను పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇది ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న అర్జున్ పాత్రకు సంబంధించిన ఇండికేషన్ అన్నమాట. స్విమ్మింగ్ పూల్ లో సేదదీరుతున్న అర్జున్ ను వెనుక నుంచి చూపిస్తూ ప్రి లుక్ లాంచ్ చేశారు. గురువారం అర్జున్ ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారట.

అందరూ ఈ సినిమాలో అర్జున్ విలన్ అని అనుకున్నారు. నితిన్ కు అతన ఎనిమీ అని అంచనా వేశారు. కానీ ఇంటలిజెన్స్ అనే పదానికి ఇండికేషన్ గా అర్జున్ పాత్రను చెబుతున్నారంటే.. ఇందులో విలన్ వేరొకరన్నమాట. అర్జున్ ది నెగెటివ్ రోల్ అయ్యుండొచ్చకపోవచ్చేమో. దీంతో అర్జున్ పాత్రపై మరింతగా క్యూరియాసిటీ పెరిగిపోతోంది జనాల్లో.

,  ,  ,  ,  ,