Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Apr-2017 10:45:40
facebook Twitter Googleplus
Photo

అ..ఆ.. మూవీ సక్సెస్ తో హీరోగా అనేక మెట్లు ఎక్కేశాడు యంగ్ హీరో నితిన్. ప్రస్తుతం ఈ కుర్ర హీరో లై అనే చిత్రంలో నటిస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని భారీ స్థాయిలోనే తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ఓ కీలక పాత్రను సీనియర్ నటుడు అర్జున్ పోషిస్తుండగా.. ఇప్పుడు షూటింగ్ లో జాయిన్ అయినట్లు చెప్పాడు అర్జున్.

ప్రస్తుతం నితిన్ మూవీ షూటింగ్ యూఎస్ లో జరుగుతోంది. ఏప్రిల్ మొదటి వారం నుంచి అక్కడే మకాం వేసిన యూనిట్.. ప్రస్తుతం లాస్ వెగాస్ కు చేరింది. అర్జున్ కూడా అక్కడికే చేరుకుని తన వెర్షన్ కు షూటింగ్ స్టార్ట్ చేసేశాడు. లై షూటింగ్ స్పాట్ నుంచి పియానో వాయిస్తున్న ఓ ఫోటోను ట్వీట్ చేసిన అర్జున్.. అదే విషయాన్ని అనౌన్స్ చేశాడు. లై చిత్రంలో అర్జున్ పోషిస్తున్నది చాలా కీలకమైన రోల్ అని.. కథకు పిల్లర్ గా నిలబడే పాత్ర అని తెలుస్తోంది.

రెండున్నర నెలల పాటు అమెరికాలో ఉండనున్నారు నితిన్ అండ్ టీం. జూన్ చివరలో తిరిగి హైద్రాబాద్ చేరుకుని.. మిగిలిన భాగాన్ని పూర్తి చేస్తారట. లై మూవీ గ్రాండ్ స్కేల్ లో ఉంటుందని.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని దర్శకుడు హను రాఘవపూడి చూపించే తీరు ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.

,  ,  ,  ,  ,  ,