Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Feb-2017 10:45:18
facebook Twitter Googleplus
Photo

2016 లో విడుదలైన మహేష్ బాబు చిత్రం బ్రహ్మోత్సవం బాక్సాఫీస్ ముందు పరాజయం పొందడంతో బాగా గ్యాప్ తీసుకున్న మహేష్ మురుగదాస్ కాంబినేషన్లో సినిమా మొదలుపెట్టి అభిమానులకు మంచి కిక్ ఇచ్చాడు. మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా చెప్పుకుంటున్న ఈ ప్రాజెక్ట్ మొదలై చాలా రోజులు కావడంతో అభిమానులు ఎప్పటికప్పుడు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ వంటివి ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.
కానీ మురుగదాస్ మాత్రం ఇన్నాళ్లు వాళ్లను ఏమాత్రం కనికరించలేదు. కనీసం సినిమా టైటిల్ ఏమిటో కూడా చెప్పలేదు. దీంతో ఫ్యాన్స్ పూర్తి నిరుత్సాహంతో మునిగిపోయారు. సోషల్ మీడియాలో మురుగదాస్ ను టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడని అడుగుతూనే ఉన్నారు. చివరికి వాళ్ళకు ఉపశమనంతో పాటు షాకింగ్ సప్రైజ్ అన్నట్టు మురుగదాస్ ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ డేట్స్ లాటి చిన్నచిన్నవి కాకుండా ఏకంగా జూన్ 23న సినిమా థియేటర్లలోకి దిగుతుందని ప్రకటించేశాడు. ఈ ప్రకటనతో అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది

,  ,  ,  ,  ,  ,