Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Feb-2017 10:25:07
facebook Twitter Googleplus
Photo

మెగా హీరోలు తామంతా ఒకటే అని ఎన్ని సార్లు చెబుతున్నా.. ఏదో ఒక డిఫరెన్స్ మాత్రం కనిపిస్తూనే ఉంది. వారి మధ్య విబేధాలు ఉన్నాయనే సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి.. అల్లు అండ్ టీంకు పడడం లేదని.. అల్లు అర్జున్ "చెప్పను బ్రదర్' స్టేట్మెంట్ తర్వాత ఓపెన్ అయిపోయింది.

ఆ తర్వాత బన్నీ వివరణ ఇచ్చాడు కానీ.. తాజాగా కాటమరాయుడు విషయంలో అల్లు అర్జున్ సైలెన్స్ పాటించడం చూస్తుంటే.. వీరిద్దరి మధ్యా ఇంకో ఏదో వివాదం నడుస్తోందని అనిపించక మానదు. తాజాగా కాటమరాయుడు ట్రైలర్ రిలీజ్ అవడం.. మెగా హీరోలంతా పవన్ ను.. కాటమరాయుడు టీజర్ ను పొగిడేయడం జరిగింది. కానీ అల్లు అర్జున్ మాత్రం కాటమరాయుడుపై చిన్న ట్వీట్ కూడా పెట్టలేదు. విషెస్ చెప్పలేదు. విచిత్రం ఏంటంటే.. అల్లు శిరీష్ కూడా పవన్ ను గ్రీట్ చేయకపోవడం. గౌతమిపుత్ర శాతకర్ణి.. శతమానం భవతి వంటి ఇతర హీరోల సినిమాలకు కూడా విషెస్ చెబుతున్న అల్లు హీరోలు.. పవన్ విషయంలో మాత్రం సైలెన్స్ పాటిస్తుండడం.. దేనికి సంకేతంగా భావించాలో? #సైలన్స్ ఎందుకు బ్రదర్

అయితే అల్లు అర్జున్ గత రెండు రోజులుగా తిరుపతిలో బాలాజీ దర్శనంలో బిజీగా ఉన్నాడు. ఒకవేళ మనోడు ఇంకా కాటమరాయుడు టీజర్ చూడలేదేమో. అయితే అల్లు శిరీష్ మాత్రం కన్నడ సినిమాలను హైదరాబాద్ దియేటర్లలో చూస్తూ బిజీగా ఉన్నాడు కాని.. టీజర్ మాత్రం చూసినట్లు లేడు.

,  ,  ,  ,  ,  ,  ,  ,