Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Apr-2016 18:05:48
facebook Twitter Googleplus
Photo

సరైనోడు చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి జంటగా టాలీవుడ్ యంగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఓ పల్లెటూరి అమ్మాయిగా మేకప్ కూడా లేని పాత్రను రకుల్ చేస్తుండగా.. ఈ మూవీలో ఎమ్మెల్యేగా మలయాళీ భామ కేథరిన్ థ్రెసా కీలక పాత్ర చేస్తోంది. ఇదీ సరైనోడు కోసం ఆ మూవీ యూనిట్ చేసిన ప్రచారం.

సరైనోడు మూవీని చూసిన ఆడియన్స్ కు మాత్రం మెయిన్ హీరోయిన్ ఎవరో అర్ధం కాలేదు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ ని మేకప్ లేకుండా చూపించేస్తున్నామంటూ చెప్పినవన్నీ సరికాదని తేలిపోయింది. ఆమెను ఓ అతిలోక సుందరి రేంజ్ లో ప్రజెంట్ చేశారు. అదికూడా ఫుల్లు మేకప్పుతో అనే విషయం తెలిసిపోతోంది. మరోవైపు పాటల సంగతి వదిలేస్తే.. రకుల్ కనిపించే సన్నివేశాలను వేళ్లపై లెక్క పెట్టేయచ్చు. ఇక సెకండ్ హీరోయిన్ గా చెప్పిన మలయాళీ సుందరి కేథరిన్ థ్రెసాకి అయితే.. సినిమాలో చాలా స్క్రీన్ స్పేస్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మెయిన్ హీరోయిన్ రకుల్ కంటే ఈమె పాత్రే ఎక్కువగా ఉంటుంది. అలాగే కామెడీ ఎంటర్టెయిన్మెంట్ లాంటివి కూడా కేథరిన్ పోషించిన ఎమ్మెల్యే పాత్రకే ఉన్నాయి.

సినిమా చూసినవాళ్లకు కేథరిన్ లీడ్ రోల్ అనిపించక మానదు. అయితే.. యూనిట్ మాత్రం ఇందుకు రివర్స్ లో ప్రచారం చేసినట్లుగా అనిపిస్తుంది. మరి హీరో- డైరెక్టర్ కు మాత్రం రకుల్ కేరక్టర్ మెయిన్ హీరోయిన్ అని ఎలా అనిపించిందబ్బా?

,  ,  ,  ,  ,  ,