Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Mar-2017 12:25:52
facebook Twitter Googleplus
Photo

పిల్ల జమీందార్ మూవీతో గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు జి అశోక్. అంతకు ముందు ఆకాశ రామన్న.. ఆ తర్వాత సుకుమారుడు చిత్రాలతో పరాజయాలు ఎదుర్కున్నాడు. ఈ నెల 10న విడుదల కాబోతోన్న అంజలి నటించిన చిత్రాంగద మూవీని డైరెక్ట్ చేశాడు.

రెండేళ్లకు పైగా ఈ చిత్రాంగద షూటింగ్ జరగ్గా.. 'అమెరికాలో మాకు కావాల్సిన వాతావరణం ఉన్నపుడే షూట్ చేయాలి. ఓ పది రోజులు షూట్ చేశాక ఆర్నెల్లు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ లో కొంచెం లేట్ అయింది. అంతే తప్ప ప్రాజెక్టుకి మాత్రం ఎప్పుడూ బ్రేక్ పడలేదు' అంటున్న అశోక్.. ఓ చైల్డ్ యాక్టర్ కూడా. రేపటి పౌరులుతో పరిచయం అయ్యి మొత్తం 16 సినిమాల్లో నటించాడు. ఈయనకు మొత్తం 13 రకాల క్లాసికల్ డ్యాన్సులు వచ్చు. అంతే కాదు.. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కూడా.

వందల కొద్దీ స్టేజ్ షోస్ చేస్తున్న సమయంలోనే ఆడాళ్లా మజాకా చిత్రంతో డ్యాన్స్ అసిస్టెంట్ గా పని చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత మొత్తం 300 పాటలకు పని చేశాడు అశోక్. ఆ తర్వాత యూకే వెళ్లి సల్సా.. జుంబా డ్యాన్సులు నేర్చుకున్నాడు. అప్పుడే డైరెక్షన్ లో ట్రైనింగ్ తీసుకుని.. అనేక డాక్యుమెటరీల రూపకల్పనలో భాగం అయ్యాడు.

వీధిబాలలపై నవజీవన్ పేరుతో తీసిన డాక్యుమెంటరీకి అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్స్ రాగా.. ఉషోదయం పేరుతో తీసిన బాలల చిత్రానికి నంది అవార్డ్ దక్కింది. మొదటగా ఫ్లాష్ న్యూస్ పేరుతో ఎలక్ట్రానిక్ జర్నలిజంపై కాన్సెప్ట్ సినిమా.. ఆ తర్వాత ఆకాశ రామన్న చిత్రంతో కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా మారాడు. అయితే.. రిలీజ్ టైమింగ్.. ప్రమోషన్ సరిగా లేకపోవడంతో ఆ రెండు ఫెయిల్ అయినట్లు చెప్పుకొచ్చాడు అశోక్.

,  ,  ,  ,  ,  ,