Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Dec-2014 10:59:02
facebook Twitter Googleplus
Photo

పవన్, వెంకీ అభిమానులు ఉత్సుకతతో ఎదురుచూస్తున్న 'గోపాల గోపాల' చిత్రం ఆడియో వేడుకకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 28న ఈ వేడుకను హైదరాబాదులో ఘనంగా నిర్వహించడానికి నిర్ణయించినట్టు సమాచారం. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్న సంగతి విదితమే. కాగా, ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి విశేష ఆదరణ లభిస్తోంది. హిందీలో వచ్చిన 'ఓ మై గాడ్' చిత్రం ఆధారంగా దీనిని నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే. వెంకీ సరసన శ్రియా కథానాయికగా నటిస్తోంది. 'తడాఖా' ఫేం డాలీ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,