Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jan-2017 16:44:54
facebook Twitter Googleplus
Photo

గత కొన్నేళ్లలో ఎంతోమంది వారసులు తెలుగు సినిమాల్లోకి అరంగేట్రం చేశారు. వాళ్లలో చాలామంది హీరోలుగా సెటిలయ్యారు. ఇప్పుడిక అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న అరంగేట్రం అంటే నందమూరి మోక్షజ్నదే. ఈ అరంగేట్రం కోసం నందమూరి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోక్షజ్న ఎంట్రీ 2017లోనే అని బాలయ్య ఆల్రెడీ స్పష్టం చేశాడు. ఇటీవలే మోక్షజ్నను తనే లాంచ్ చేయనున్నట్లు నిర్మాత సాయి కొర్రపాటి కన్ఫమ్ చేశాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కొడుకు అరంగేట్రం గురించి బాలయ్య ఆసక్తిక వర్యాఖ్యలు చేశాడు. మోక్షజ్నను నెక్స్ట్ లవర్ బాయ్ అనుకోవచ్చా అని ఈ ఇంటర్వ్యూలో బాలయ్యను అడిగితే.. మా ఫ్యాన్స్ ఒప్పుకోరేమో అని ఆయన బదులివ్వడం విశేషం. ఇంకా కొడుకు అరంగేట్రం గురించి బాలయ్య ఏమన్నాడంటే..

ఈ ఏడాది చివర్లో మోక్షజ్న సినిమా మొదలు కావచ్చు. ప్రస్తుతానికి అతను అన్ని రకాలుగా ట్రైన్ అవుతున్నాడు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు క్రిష్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టరుగా పని చేసి అన్ని విషయాలపై అవగాహన పెంచుకున్నాడు. మోక్షజ్న కోసం ఎలాంటి కథ అన్నది ఇంకా ఫైనలైజ్ కాలేదు. దర్శకుడిని కూడా ఖరారు చేయలేదు. సరైన కథ.. సరైన దర్శకుడి కోసం చూస్తున్నాం. నా ఉద్దేశం ప్రకారం మేమిద్దరం కలిసి ఆదిత్య 999 చేస్తే బాగుంటుంది. అందులోని పాత్రలు మా ఇద్దరికీ బాగా సూటవుతాయి. కచ్చితంగా భవిష్యత్తులో మేమా సినిమా చేస్తాం. దాని స్క్రిప్టు విషయంలో నాకు పూర్తి విశ్వాసం ఉంది అని బాలయ్య తెలిపాడు

,  ,  ,  ,  ,