Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Aug-2017 10:35:16
facebook Twitter Googleplus
Photo

ప్రతీ నెలలోను ఒకట్రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉండడం కామనే కానీ.. ఆగస్ట్ పై మాత్రం అనేక చిత్రాలు కన్నేసేశాయి. ఏ ఒక్క వారాన్ని వదిలిపెట్టకుండా క్యూ కట్టేశాయి.

కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన నక్షత్రం.. సుకుమార్ నిర్మాణంలో రూపొందిన దర్శకుడు చిత్రాలు ఆగస్ట్ 4న విడుదల కానున్నాయి. ఒకటి కృష్ణవంశీ మూవీ.. రెండోదీ సుకుమార్ బ్యాకింగ్ ఉన్న సినిమా కావడంతో రిజల్ట్ పై ఆసక్తి నెలకొంది. తర్వాతి వారం పోరు మాత్రం రసవత్తరంగా ఉండనుంది.

నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన లై.. ఆగస్ట్ 11 విడుదల కానుండగా.. అదే రోజున రానాతో తేజ తీసిన నేనే రాజు నేనే మంత్రి కూడా విడుదల కానుంది. ఈ రెండు సినిమాల పోటీ కేకలు పుట్టిస్తుండగా.. వీటికి ఒక రోజు ముందే బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన జయ జానకి నాయక విడుదల చేస్తారని అంటున్నారు.

ఆ తర్వాతి వారం అంటే ఆగస్ట్ 18న తాప్సీ నటించిన ఆనందో బ్రహ్మ.. సునిల్ హీరోగా క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఉంగరాల రాంబాబు విడుదల అవుతున్నాయి. ఆగస్ట్ 24న నాగ చైతన్య నటించిన యుద్ధం శరణం విడుదల అవుతుండగా.. అదే రోజున అజిత్ డబ్బింగ్ మూవీ వివేగం కూడా రిలీజ్ చేస్తున్నారు.

ఆగస్ట్ 25న విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి.. అల్లరి నరేష్ మూవీ మేడ మీద అబ్బాయి విడుదల అవుతున్నాయి.

,  ,  ,  ,  ,