Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jun-2017 11:33:32
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తెలుగు జనాల వరకే కాదు.. అంతకు మించి దువ్వాడ జగన్నాధం గురించి తెగ డిస్కషన్స్ జరిపోతున్నాయి. అంతకంతకూ క్రేజ్ పెరిగిపోతూనే ఉంది. రీసెంట్ టైంలో ఏ స్టార్ హీరో సినిమాకి లేని మాదిరిగా రెండో థియేట్రికల్ ట్రైలర్ కూడా ఇచ్చి అమాంతం హైప్ పెంచేశారు.

ఇప్పుడు దువ్వాడ జగన్నాధం షూటింగ్ అధికారికంగా ముగిసిపోయింది. క్లైమాక్స్ పార్ట్ షూట్ ను దర్శకుడు హరీష్ శంకర్ పూర్తి చేసేశాడు. ప్యాచ్ వర్క్ లతో సహా పనులన్నీ పూర్తయిపోవడంతో.. ప్రమోషన్స్ పై ఫుల్లుగా కాన్సంట్రేట్ చేయనున్నారు. ఆఖరి రోజు షూటింగ్ సమయంలో.. దువ్వాడ జగన్నాధం సెట్స్ కు మరో ఇద్దరు క్రేజీ డైరెక్టర్లు వచ్చారు. వాళ్లెవరో కాదు.. ఇష్క్-మనం వంటి చిత్రాలు తీసిన విక్రమ్ కె కుమార్ ఒకడైతే.. ఎవడు - ఊపిరి వంటి మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న వంశీ పైడిపల్లి మరొక దర్శకుడు. డీజే సెట్స్ కు స్నేహితుల రాక అంటూ వారిద్దరితో కలిసి దిగిన ఫోటోను ఫాలోయర్స్ కు చూపించాడు హరీష్ శంకర్.

క్రేజీ డైరెక్టర్లు ముగ్గురు ఒకచోటకు చేరడంతో విజువల్ అదిరిపోయిందని చెప్పాలి. ఇక దువ్వాడ జగన్నాధం ఆడియో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఇంతటి ఫాస్ట్ బీట్స్ ఉన్న సినిమా ఈ మధ్య కాలంలో రాలేదనే కామెంట్స్ ను అందుకోవడం విశేషం. దువ్వాడ జగన్నాధం ఆడియో విషయంలో.. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ విపరీతంగా హైలైట్ అవుతోంది.

,  ,  ,  ,  ,  ,