Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Feb-2015 11:46:43
facebook Twitter Googleplus
Photo

'టెంపర్' సినిమాతో సక్సెస్ కొట్టిన దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రస్తుతం చిరంజీవి పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు. మెగాస్టార్ నటించే 150వ సినిమాని డైరెక్ట్ చేయాలని ఈ దర్శకుడు తహతహలాడుతున్నాడు. ఈ క్రమంలో చిరంజీవి ఛాన్స్ ఇస్తే అదిరిపోయే సినిమా తీస్తానంటూ ఇటీవల స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అయితే, ఇంతవరకు చిరు నుంచి పిలుపు రాలేదట. అందుకే, ఆయన ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నానని అంటున్నాడు. తాను చిన్నప్పటి నుంచీ చిరంజీవికి కరడుగట్టిన అభిమానినని పూరీ చెప్పాడు. ఆయన కోసం 'ఆటో జానీ' అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసి పెట్టుకున్నానని వెల్లడించాడు. చిరంజీవి ఓకే అంటే కనుక వెంటనే ఆ టైటిల్ కి తగ్గా స్క్రిప్ట్ తయారుచేస్తానని ధీమాగా చెప్పాడు. మరి, మెగాస్టార్ ఈ అభిమానిని పిలుస్తాడా?

,  ,  ,  ,