సీరియల్ తో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించింది అవికా గోర్. ఆమె తెలుుగలో నటించిన తొలి సినిమా ఉయ్యాల జంపాల సూపర్ హిట్. ఆ తర్వాత కూడా ఆమెకు సినిమా చూపిస్త మావ.. ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి హిట్లున్నాయి. అయినప్పటికీ ఆమె కెరీర్ ఊపందుకోలేదు. ఇక్కడ అవకాశాలు రాక.. బాలీవుడ్లోనూ ఛాన్సులు లేక హీరోయిన్ గా అడుగులు ముందుకు వేయలేకపోయింది అవికా. ఆమె ఇక సినిమాలు చేయాలనుకోవట్లేదని.. మళ్లీ సీరియళ్లలోకి వెళ్లిపోవాలనుకుంటోందని వార్తలు వచ్చాయి.
ఐతే తాజా సమాచారం ఏంటంటే.. అవికా టీవీ సీరియళ్లలో కూడా నటించడానికి ఇష్టపడట్లేదట. ఆమె నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పేయనుందట. ఆమె క్రియేటివ్ సైడ్ వెళ్లిపోవాలని డిసైడైందట. అవికా ప్రస్తుతం ముంబయిలోని ఒక ఫిలిం ఇన్ స్ట్యిట్యూట్లో డైరెక్షన్ కోర్సు చేయడానికి రెడీ అయిందట. అది పూర్తయ్యాక అక్కడే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయాలని.. ఆ తర్వాత దర్శకత్వం చేపట్టాలని ఆమె ఫిక్సయిందట. హీరోయిన్ గా కొనసాగడానికి తన ఫిజిక్.. లుక్స్ సరిపోవని ఫిక్సయిన అవికా.. ఇక నటన జోలికి వెళ్లకపోవడమే మంచిదని భావిస్తోందట. ఐతే మంచి నటి అయిన అవికా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.