Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Sep-2015 12:38:24
facebook Twitter Googleplus
Photo

మెగా డాటర్ నీహారిక స్పీడ్ చూస్తుంటే .. టాలీవుడ్ - కోలీవుడ్ షేకైపోవడం ఖాయం అనిపిస్తోంది. మొన్నటికి మొన్న ఇలా మొదటి సినిమా ప్రకటించిందో లేదో అప్పుడే రెండో సినిమా కోసం ఆఫర్ వచ్చి పడింది. పైగా ఇది తెలుగు - తమిళ్ ద్విభాషా చిత్రం. ఓ రకంగా నీహారిక తమిళ ఎంట్రీ కి ఛాన్సొచ్చింది. ఓ సినిమా చర్చల్లో ఉండగానే ఇలా రెండో సినిమా ఛాన్స్ కొట్టేయడం రెండు భాషల్లో ఒకే సారి ఎంట్రీ ఇవ్వడం బహుషా రేర్ ఛాన్స్. ఇలాంటి అవకాశం ఎందరికి సాధ్యం? దటీజ్ కాల్డ్ మెగా హవా...

నీహారిక ఆరంభం మాటీవీ లో కెరీర్ ప్రారంభించిన బుల్లితెర యాంకర్ గా ట్యాలెంట్ ప్రదర్శించింది. అటుపై నేరుగా మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు ఫేం రామరాజు వినిపించిన కథ విని ఓకే చేసింది. నాగశౌర్య సరసన నాయికగా నటించడానికి అంగీకరించింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ కెళుతోంది అన్న వార్త వెలువడింది. ఈ సినిమా గురించి చర్చ సాగుతుండగానే మరో సినిమా సెట్స్ కెళ్లబోతోంది అంటూ హాట్ న్యూస్ వచ్చింది.

ఈసారి అవార్డు సినిమా దర్శకుడు అయోధ్య కుమార్ వినిపించిన కథని సెలక్ట్ చేసుకుందని చెబుతున్నారు. అయోధ్య కుమార్ మిణుగురులు చిత్రంతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. పలు అవార్డు వేడుకల్లో మిణుగురులు ప్రదర్శితమైంది. జాతీయ అంతర్జాతీయ సినిమా ఉత్సవాల్లో ప్రదర్శితమైంది. అంత పేరున్న దర్శకుడు కాబట్టే నాగబాబు అంగీకరించారని భావించాలి. తెలుగు - తమిళ్ ద్విభాషా చిత్రానికి నీహారిక ఎంట్రీ సిద్ధమైనట్టే. ఈ స్పీడ్ హైస్పీడ్ లోనే కనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్ టు మెగా డాటర్ నీహారిక.

,  ,  ,