Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Sep-2016 12:12:55
facebook Twitter Googleplus
Photo

నేచురల్ స్టార్ నాని.. ఈ రేంజ్ కి రాకముందు నటించిన భారీ బడ్జెట్ మూవీ ఈగ. ఈ సినిమాకు సీక్వెల్ పై ఎప్పుడూ కబుర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఈగకు సీక్వెల్ తీయడానికి ఆస్కారం ఉందని రాజమౌళి అంటూ ఉంటాడు కానీ.. ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించే విషయంపై మాత్రం నోరు మెదపడు. మరోవైపు నాని కూడా ఈగ సీక్వెల్ గురించి వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నాడు.

'ఈగ2 మూవీపై చాలా వార్తలే చదువుతూ ఉంటాను. కొత్త కబురు ఏది చదివినా.. ఇదన్నా నిజమైతే బాగుండు అనుకుంటూ ఉంటాను. ఇప్పటికీ రాజమౌళిని కలసి సారి దీనిపై ఎంక్వైరీ చేస్తూనే ఉంటాను. ఆయనకి కూడా ఇంట్రెస్ట్ ఉంది కానీ.. ఇది పట్టాలెక్కుతుందో లేదో అర్ధం కావడం లేదు. ఒకవేళ సీక్వెల్ చేస్తే అందులో నేను నటిస్తానా లేదా అని అడుగుతూ ఉంటారు. కానీ ఈగ మూవీ ప్రారంభంలోనే నా పాత్ర చనిపోతుంది. టెక్నికల్ గా చూస్తే.. నేను మళ్లీ బతికి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి.. రెండో భాగంలోనే నేను ఉండడం కష్టమే' అంటున్నాడు నాని.

అయితే.. ఓ ఫ్యాన్ గా మాత్రం ఈగ చిత్రం సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నానని అంటున్నాడు నాని. ఈగ2 కనుక వస్తే.. టాలీవుడ్ లో మళ్లీ కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నాడు నేచురల్ స్టార్ నాని.

,  ,  ,  ,  ,  ,