Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-May-2017 13:44:07
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు ఇండియా అంతటా కూడా బాహుబలి 2 తాలూకు వసూళ్ళ ప్రభంజనం తెగ కనిపిస్తోంది. రిలీజైన 5 రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా వందల కోట్ల నెట్ కలక్షన్లు సాధించడంతో.. చాలా వరకూ రికార్డులన్నీ చెల్లాచెదురయ్యాయ్. ఇప్పుడు ఏకంగా ఇండియాలో అత్యంతగా వసూలు చేసిన సినిమాగా కేవలం 5 రోజుల్లో బాహుబలి 2 ప్రథమ స్థానంలోకి వచ్చేసింది.

నిజానికి ఫుల్ టైమ్ రన్ లో కూడా దంగల్.. పీకె వంటి సినిమాలు 380 కోట్లు 'నెట్' కలక్షన్ మాత్రమే ఇండియాలో వసూలు చేశాయి. ఈ సినిమాలన్నీ కూడా హిందీతో పాటు సౌత్ బాషల్లో కూడా రిలీజయ్యాయ్. అయితే ఆ సినిమాలన్నింటి లైఫ్ టైమ్ కలక్షన్ ను అప్పట్లో బాహబలిః ది బిగినంగ్.. తన లైఫ్ టైమ్ కలక్షన్ తో ఓవర్ టేక్ చేసింది. కాకపోతే బాహుబలి 1 మొత్తంగా ధియేటర్ల నుండి ఇండియాలో 420 కోట్ల నెట్ కలక్షన్ పట్టుకొస్తే.. ఇప్పుడు బాహుబలి 2 మాత్రం ఏకంగా 5 రోజుల్లో 435 కోట్లు తెచ్చేసి మకుటాన్ని ధరించింది. ఆ లెక్కన చూస్తూ ఫుల్ రన్ లో ఇంకెంత తెస్తుందో చూసుకోండి.

ఇప్పటివరకు ఇండియాలో అత్యధికంగా వసూలు చేసిన టాప్ 10 సినిమాలను చూసుకుంటే (నెట్ కలక్షన్).. ఈ విధంగా ఉన్నాయ్.

1) బాహుబలిః ది కంక్లూజన్ - 435 కోట్లు.. (5 రోజులు)

2) బాహుబలిః ది బిగినింగ్ - 420 కోట్లు..

3) దంగల్ - 387 కోట్లు

4) పీకె - 338 కోట్లు

5) బజరంగీ భాయిజాన్ - 317 కోట్లు

6) సుల్తాన్ - 302 కోట్లు

7) ధూమ్ 3 - 275 కోట్లు

8) కిక్ - 213 కోట్లు

9) చెన్నయ్ ఎక్స్ ప్రెస్ - 208 కోట్లు

10) రోబో - 207 కోట్లు

,  ,  ,  ,  ,  ,