Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-May-2017 15:43:19
facebook Twitter Googleplus
Photo

బాహుబలి: ది కంక్లూజన్ మూడో వారాంతంలోనూ మంచి వసూళ్లు సాధించింది. ఈ శుక్ర.. శని.. ఆదివారాల్లో కలిపి ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.10.43 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. రెండో వారాంతంతో పోలిస్తే జోరు కొంచెం తగ్గింది కానీ.. వసూళ్లు మరీ ఏమీ పడిపోలేదు. ఈ వారం మొత్తంలో దాదాపు రూ.20 కోట్ల దాకా షేర్ వచ్చే అవకాశాలున్నాయి. సెకండ్ వీకెండ్లో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్.. తెలంగాణల్లో కలిపి రూ.42.35 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా మూడో వీకెండ్ అయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి-2 షేర్ రూ.170 కోట్లను దాటింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.200 కోట్ల షేర్ మార్కుకు దగ్గరగా వెళ్లే అవకాశముంది. వరల్డ్ వైడ్ ‘బాహుబలి: ది కంక్లూజన్’ గ్రాస్ వసూళ్లు రూ.1300 కోట్లను దాటాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా మూడో వారాంతం అయ్యేసరికి బాహుహుబలి-2 షేర్స్ వివరాలు..

నైజాం-రూ.57.78 కోట్లు
వైజాగ్ (ఉత్తరాంధ్ర)-రూ.22.4 కోట్లు
సీడెడ్ (రాయలసీమ)-రూ.29.7 కోట్లు
తూర్పు గోదావరి-రూ.15.24 కోట్లు
పశ్చిమగోదావరి-రూ.11.12 కోట్లు
గుంటూరు-రూ.15.63 కోట్లు
కృష్ణా- రూ.12.11 కోట్లు
నెల్లూరు-రూ.6.55 కోట్లు
ఏపీ-తెలంగాణ షేర్- రూ170.53 కోట్లు

,  ,  ,  ,