Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Feb-2017 12:19:38
facebook Twitter Googleplus
Photo

శివుడు రుద్రతాండవం చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు బాహుబలిః ది కంక్లూజన్ సినిమా కోసం ప్రభాస్ కూడా అలాంటి ఫీట్లనే చేసినట్లున్నాడు. అదిగో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇప్పుడు ఈ కండలవీరుడు కొత్త పోస్టర్ ఒకటొచ్చింది. అది చూస్తేనే రోమాలు నిక్కపొడుచుకునే స్థాయిలో ఉన్న మాట వాస్తవం.

శివరాత్రి సందర్బంగా బాహుబలి 2 టీజర్ ఏదైనా రిలీజ్ చేస్తారా అనుకుంటే.. ప్రస్తుతానికి మరో కొత్త పోస్టర్ తో సరిపెట్టేశాడు రాజమౌళి. ఇప్పటివరకు ఈ 2వ పార్టుకు సంబంధించి మూడు పోస్టర్లు రాగా.. మూడూ కూడాను ఏదో విధంగా కాంట్రోవర్సీలతో కాలం గడిపేశాయి. ఒక పోస్టర్లో కామిక్ నేచర్ ఉందని.. ఇంకో దాంట్లో బాణం తప్పుగా ఉందని.. నెటిజన్లు పిచ్చెత్తించారు. అందుకే ఇప్పుడు అనేక జాగ్రత్తలతో రాజమౌళి బాహుబలి కొత్త పోస్టర్ ను రూపొందించినట్లున్నాడు. హీరోయిజమ్ ఉట్టిపడేలా ఇందులో ఏనుగు తొండంపైనుండి సింహాసనం అధీష్టిస్తున్న యోధుడిలా బాహుబలి కొత్త పోస్టర్ ను తీర్చిదిద్ది రిలీజ్ చేశారు.

ఇకపోతే సినిమాను ఏప్రియల్ 28న రిలీజ్ చేస్తున్నారు కాబట్టి.. అఫీషియల్ గా శివరాత్రి నుండి సినిమా ప్రమోషన్లను మొదలెట్టేస్తున్నట్లు తెలుస్తోంది

,  ,  ,  ,  ,