Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jun-2017 13:45:20
facebook Twitter Googleplus
Photo

తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి: ది కంక్లూజన్ ప్రభంజనం ఎలా సాగిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అప్పటిదాకా హైయెస్ట్ గ్రాసర్ గా ఉన్న బాహుబలి: ది బిగినింగ్ సాధించిన వసూళ్ల కంటే ప్రతి రోజూ 50 శాతం అధికంగానే వసూలు చేస్తూనే సాగిందీ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి-2’ ఫుల్ రన్ షేర్ రూ.150 కోట్లు దాటుతుందని ముందు అంచనా వేయగా.. ఆ అంచనాల్ని దాటి దూసుకెళ్లిందీ సినిమా. పది రోజుల్లోనే రూ.175 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత కూడా జోరు కొనసాగిస్తూ 3.. 4 వీకెండ్లలోనూ మంచి వసూళ్లు సాధించింది. కానీ ఆ తర్వాత మాత్రం బాహుబలి-2 బండి అనుకున్నట్లుగా నడవట్లేదు.

ఓ దశలో ఈ సినిమా జోరు చూసి తెలుగు రాష్ట్రాల్లో రూ.200 కోట్ల షేర్ పక్కా అని అంచనా వేశారు. కానీ గత రెండు వారాల నుంచి బాహుబలి-2 అతి కష్టం మీద నడుస్తోంది. చెప్పుకోదగ్గ వసూళ్లు రావట్లేదు. దీంతో రూ.190 కోట్ల మార్కు దాటాక.. బండి ముందుకు సాగట్లేదు. ఆరో వీకెండ్ అయ్యాక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.192.9 కోట్ల షేర్ సాధించింది. ఇప్పటిదాకా దాదాపుగా థియేట్రికల్ రన్ పూర్తయినట్లే ఉంది. థియేటర్లు బాగా తగ్గిపోయాయి. రారండోయ్ వేడుక చూద్దాం వచ్చాక బాహుబలి-2 కలెక్షన్లకు బాగానే గండి పడింది. ఇప్పుడున్న వేగంతో రూ.200 కోట్ల షేర్ మార్కును అందుకోవడం మాత్రం కష్టమే. ఫుల్ రన్లో షేర్ రూ.195 కోట్ల మార్కు దగ్గర ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

,  ,  ,  ,  ,