రాజమౌళి మరోసారి రివ్యూ రైటర్ ఎత్తేశాడు. ఈ మధ్యన బాహుబలి 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి.. ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి సినిమాను చూశాడట. ఇంతకీ ఆ సినిమా మనోడికి ఎలా అనిపించింది? ఈ విషయంలో మాత్రం తన భళ్లాలదేవుడు తనకు ఎక్కువగా నచ్చేశాడనే చెబుతున్నాడు జక్నన్న. పదండి ఏమంటున్నాడో చూద్దాం.
తేజ గారు నేనే రాజు నేనే మంత్రిని చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ప్రతీ ఒక్కరూ బాగా నటించారు. బళ్లాలదేవుడుని చూసి గర్వపడుతున్నా. కాజల్ బాగుంది. క్యాథరీన్ కూడా బాగుంది. నవదీప్ కూడా చక్కగా చేశాడు. సినిమా ఓపెనింగ్ సీక్వెన్సు.. క్లయమ్యాక్స్ ట్విస్టు అదిరిపోయాయ్. చాలారోజుల తరువాత ఒక అర్ధవంతమైన సినిమా వచ్చింది అంటూ తన రివ్యూ ఇచ్చేశాడు రాజమౌలి. బాహుశా ఈ సినిమాలో రాజమౌళి తన భావాలకు దగ్గరగా ఉన్న డైలాగులనూ వినడం వలన.. సీన్లను చూడటం వలన బాగా కనక్ట్ అయ్యాడేమో. గతంలో లోక్ సత్తా వంటి పార్టీ సాక్షిగా తన భావాలను వ్యక్తీకరించిన రాజమౌళికి.. ఈ సినిమా నచ్చడంలో అతిశయోక్తి లేదు.
ఇకపోతే ఇప్పుడు రాజమౌళి రివ్యూ ఏదైతే ఉందో.. అది కామన్ పబ్లిక్ టాక్ తో ఏకీభవిస్తుందో లేద తెలియాలంటే కొన్ని రోజులు పడుతుంది.