Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-May-2017 16:00:08
facebook Twitter Googleplus
Photo

బాక్సాఫీస్ వద్ద మూడు వారాల విజయవిహారం తర్వాత బాహుబలి మెట్టు దిగాడు. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నార్త్ సౌత్ తేడా లేకుండా ఎదురులేకుండా దూసుకుపోయింది. బాహుబలి తర్వాత కొన్ని సినిమాలు రిలీజ్ అయినా అవి పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టింది.

తెలుగులో ఈ వారం కొత్తగా నిఖిల్ హీరోగా నటించిన కేశవ రిలీజ్ అయింది. ఈ సినిమా ట్రయిలర్ ఆసక్తికరంగా ఉండటం.. వరస హిట్లతో నిఖిల్ సినిమాలపై ఏర్పడిన పాజిటివ్ ఒపీనియన్ తో ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చాయి. ఇదే టైంలో బాలీవుడ్ లో అర్జున్ కపూర్ శ్రధ్ధకపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన హాఫ్ గర్ల్ ఫ్రెండ్ రిలీజయింది. ఫేమస్ ఇండియన్ రైటర్ చేతన్ భగత్ రాసిన నవల ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’ నవల ఆదారంగా ఈ సినిమా తెరకెక్కడంతో ఉత్తరాదిలో యూత్ ఈ సినిమాను బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. దీంతో మొదటిసారిగా బాహుబలి కలెక్షన్లలో కాస్త వెనుకబడింది.

శర్వానంద్ హీరోగా నటించిన రాధ గతవారమే థియేటర్లలోకి వచ్చినా కలెక్షన్లు యావరేజ్ గానే ఉన్నాయి. ఈ లెక్కన ఈ సినిమా ఓవరాల్ గా యావరేజ్ రేంజిలోనే మిగిలిపోయే అవకాశముంది. రొటీన్ కథే అయినా కేశవ కథనం ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకాదరణ లభిస్తోంది. బాహుబలి కలెక్షన్లు కాస్త తగ్గినా ఇంకా చెప్పుకోదగిన రీతిలోనే ఉన్నాయి. దీంతోపాటు వెంకటాపురం సినిమా కొద్ది థియేటర్లలో మాత్రమే ఆడుతోంది.

,  ,  ,  ,