Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jul-2016 11:29:56
facebook Twitter Googleplus
Photo

సమంత మాంచి వెరైటీ క్యాండిడేటు. చాలా స్ట్రాంగ్. అస్సల్ సెన్సిటీవ్ కాదు. ?మీరు ఒక్కటంటే నేను వందంట? అన్నటైపు. ట్విట్టర్ లో ఆమె కెలుకుడు గురించి చాలా న్యూసే వుంది. ఇప్పుడు ఆమె పెళ్లి మేటర్ పై రచ్చ రచ్చ జరిగుతోంది. అక్కినేని నాగచైతన్యతో పెళ్లి, సెప్టెంబరు 23 ముహూర్తం అని. ఇది ఎవరు డిసైడ్ చేశారోగాని ఇప్పుడు సోషల్ మీడియా తరుపు నుండి శుభలేఖలు కూడా ప్రింట్ అయిపోతున్నాయి.

అయితే ఇదంతా తెగ ఎంజాయ్ చేస్తోంది సామ్. తాజాగా ట్విట్టర్ లైవ్ చాట్ లోకి వచ్చిన సమంత ఓ అభిమానితో చేసి చాట్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. సరాసరి సమంత ?హనీమూన్‌? గురించి అడిగాడా అభిమాని. ?వెబ్‌సైట్లు మీ హనీమూన్‌ షెడ్యూల్‌ని కూడా ప్రకటిస్తున్నాయి. నా దగ్గర ట్రిప్‌ కూపన్లు చాలా ఉన్నాయి. అవి మీకు ఇస్తా? అని ట్వీట్ చేయగా.. దానికి నవ్వతూ .. ?థాంక్స్ ?అని ట్వీట్ చేసింది సమంత.

అంతేనా.. ?సమంత మీకు యాక్షన్‌ ప్యాక్డ్‌ హనీమూన్‌ కావాలంటే.. ఇస్తాంబుల్‌కి వెళ్లండి. అక్కడ మిలటరీ వాళ్లతో ఇప్పటికే జరుగుతోంది? అని చేసిన ట్వీట్ కి బదులిచ్చిన సామ్.. ?హూమ్‌?టెంప్టింగ్‌?అని రిప్లయ్ ఇచ్చింది.

అక్కడితో ఆగలేదు.. కొన్ని వెబ్‌సైట్లు మీ పిల్లలకు పేర్లు కూడా పెట్టేశాయి అని అంటే.. ?ఇప్పుడు నేను ఏమి చేయగలను?.. అని బదులిచ్చింది. ?అదంతా ఎందుకు అసలు విషయం చెప్పండి ?అని అడిగితే.. ?ఏదో ఒకటి ఉండాలి కదా? అని రిప్లయ్ ఇచ్చి చాట్ కు ఫుల్ స్టాప్ పెట్టింది సమంత.

ఈ చాట్ మొత్తం పరిశీలిస్తే.. మీడియాలో వస్తున్న ఫీడ్ ను సమంత తెగ ఎంజాయ్ చేస్తోందని అర్ధమౌతుంది.

,  ,  ,  ,