Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-May-2017 11:04:15
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినిమాలనే కాదు.. ఇండియాలో ప్రతి ఇండస్ట్రీలోనూ హీరోస్వామ్యమే నడుస్తుంటుంది. ఎంత పెద్ద దర్శకుడు.. ఎంత గొప్ప సినిమా తీసినా.. అది ఎంత పెద్ద విజయం సాధించినా.. అందులో ఓ స్టార్ హీరో ఉన్నాడంటే.. క్రెడిట్ ఎక్కువగా హీరోకే వెళ్తుంది. వసూళ్ల రికార్డులన్నీ హీరోకే ఆపాదిస్తారు. కానీ రాజమౌళి సినిమాలకు మాత్రం ఇది వర్తించదు.

కెరీర్ ఆరంభంలో చేసిన కొన్ని సినిమాల్ని వదిలేస్తే.. ఆ తర్వాత చేసిన సినిమాలన్నింటి విజయాల్లోనూ హీరో కన్నా క్రెడిట్ రాజమౌళికే ఎక్కువ దక్కింది. ఇక మగధీర.. ఈగ లాంటి సినిమాలకైతే సక్సెస్ లో మేజర్ షేర్ తీసుకున్నాడు జక్కన్న. బాహుబలి: ది బిగినింగ్ క్రెడిట్ కూడా పూర్తిగా జక్కన్న క్రెడిట్లోకే వెళ్లిపోయింది. బాహుబలి: ది కంక్లూజన్ విషయంలోనూ అలాగే జరుగుతుందనుకున్నారు. ఐతే ఈసారి క్రెడిట్ పూర్తిగా రాజమౌళికే వెళ్లలేదు. హీరో ప్రభాస్ కూడా తన వంతుగా కొంత తీసుకున్నాడు.

జాతీయ స్థాయిలో రాజమౌళి గురించే కాదు ప్రభాస్ గురించి కూడా పెద్ద డిస్కషనే నడుస్తోంది. అతడి మీద కూడా ప్రశంసల జల్లు కురుస్తోంది. బాహుబలి టీంలో అందరినీ పొగుడుతూనే రాజమౌళికి అగ్ర పీఠం వేస్తున్న నేషనల్ మీడియా.. హిందీ జనాలు.. ప్రభాస్ ను కూడా ఆకాశానికెత్తేస్తున్నారు. అతడి నటన.. అతడి బాడీ లాంగ్వేజ్.. స్క్రీన్ ప్రెజెన్స్.. అన్నింటి గురించీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ప్రభాస్ నిజంగా ఒక కింగే అని పొగిడేస్తున్నారు. హిందీలో ఈ సినిమాకు రివ్యూలిచ్చిన క్రిటిక్స్ అందరూ ప్రభాస్ ను ఆకాశానికెత్తేశారు. అతడి కష్టాన్ని కూడా వాళ్లు గుర్తించారు.

బాహుబలి సక్సెస్ క్రెడిట్లో ప్రభాస్ పాత్ర గురించి కూడా మాట్లాడుతున్నారు. వేరే భాషలకు చెందిన సామాన్య ప్రేక్షకులు ప్రభాస్ కు అభిమానులు అయిపోయారు. మొత్తానికి బాహుబలి తో ప్రభాస్ తిరుగులేని ఇమేజ్ సంపాదించినట్లే. ఇది అతడి తర్వాతి సినిమాలకు భలేగా కలిసొస్తుందనడంలో సందేహం లేదు.

,  ,  ,  ,  ,