Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Feb-2017 11:02:35
facebook Twitter Googleplus
Photo

ప్రతీ నెలలోనూ సినిమాలు రిలీజ్ అయిపోతుంటాయి కానీ.. ఒక నెలలో అనేక జోనర్లకు చెందిన చిత్రాలు రావడం మాత్రం అరుదుగా జరిగే సంఘటనే. ఫిబ్రవరి రిలీజ్ కు క్యూ కట్టిన మూవీస్ చూస్తే.. ఇన్నేసి భిన్నమైన చిత్రాలు ఇంత షార్ట్ గ్యాప్ లో వస్తుండడం.. ఫిలిం లవర్స్ కు పండగే అని చెప్పాలి.

ఫిబ్రవరి 3న నేను లోకల్.. లక్ష్మీ బాంబ్. కనుపాప చిత్రాలు వస్తున్నాయి. నాని మూవీ నేను లోకల్ రొమాంటిక్ ఎంటర్టెయినర్ కాగా.. లక్ష్మి మంచు నటించిన లక్ష్మీ బాంబ్ లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఫాంటసీ కం కామెడీ జోనర్ లో ఈ చిత్రం ఉంటుంది. ఇక మలయాళ మూవీ ఒప్పంను తెలుగులో కనుపాప పేరుతో తెస్తున్నారు. గుడ్డివాడిగా మోహన్ లాల్ నటన.. ప్రియదర్శన్ దర్శకత్వం అందరినీ ఆకట్టుకుంటాయనే టాక్ ఉంది.

ఆ తర్వాతి వారంలో అంటే ఫిబ్రవరి9న సూర్య నటించిన సింగం3 రిలీజ్ కానుంది. ఇది పక్కా మాస్ జోనర్ కమర్షియల్ కాగా.. ఆ మరుసటి రోజే అక్కినేని నాగార్జున నటించిన భక్తి చిత్రం ఓం నమో వేంకటేశాయ విడుదలవుతోంది. హథీరాం బాబా పాత్రలో నాగ్ ఒదిగిపోయిన తీరుకు ఇప్పటికే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే రోజున అంటే ఫిబ్రవరి 10న అంజలి నటించిన హారర్ థ్రిల్లర్ 'చిత్రాంగద' కూడా విడుదల కానుంది.

ఫిబ్రవరి 17న రాజ్ తరుణ్-అను ఇమాన్యుయేల్ నటించిన కామెడీ చిత్రం కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త విడులవుతోంది. కుక్కల కిడ్నాపర్ గా రాజ్ తరుణ్ నటిస్తున్న కామెడీ మూవీ ఇది. మంచు మనోజ్ నటించిన మాస్ మసాలా మూవీ 'గుంటూరోడు'ని కూడా ఇదే రోజుకు షెడ్యూల్ చేశారు. మరోవైపు 'ఘాజీ' అంటూ దేశభక్తి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు రానా దగ్గుబాటి-తాప్సీ పన్ను. 1971 ఇండో-పాక్ యుద్ధానికి సంబంధించిన సినిమా ఇది. హిందీ-తెలుగు-తమిళ్ లో త్రిభాషా చిత్రంగా వస్తుండగా.. ఇండియాలో సబ్ మైరైన్ కాన్సెప్ట్ తో వస్తున్న తొలి చిత్రం ఇదే.

ఇక ఫిబ్రవరి 24న సాయి ధరం తేజ్-రకుల్ ప్రీత్ సింగ్ లు నటించిన విన్నర్ విడుదల అవుతోంది. గోపీచంద్ మనలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో.. అనసూయ ఐటెం సాంగ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. మొత్తానికి ఫిబ్రవరి నెలమొత్తం మాంచి డిఫరెంట్ మూవీస్ చూసే ఛాన్స్ తెలుగు ప్రేక్షకులకు దక్కుతోంది.

,  ,  ,  ,  ,