Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Mar-2017 11:00:46
facebook Twitter Googleplus
Photo

వన్ మిలియన్ డాలర్ క్లబ్బులోకి ఎంట్రీ ఇస్తేనే గొప్పగా చెప్పుకుంటాం. ఇక 2 మిలియన్ డాలర్ క్లబ్బులోకి వస్తే మాత్రం.. మా హీరో తోపు అంటూ జబ్బలు చరుచుకుంటూ ఉంటారు అభిమానులు. అలాంటిది ఇప్పుడు ఏకంగా 15 మిలియన్ డాలర్ క్లబ్బు గురించి మాట్లాడుకోవాల్సి వస్తోంది. అసలు ఆ క్లబ్బులోకి ఎంట్రీ ఇస్తే కాని బాహుబలిః ది కంక్లూజ్ ఇప్పుడు సేఫ్ సినిమా అవ్వదు తెలుసా?

ఏకంగా 45 కోట్ల రూపాయలను వెచ్చించి.. అమెరికా కొరకు బాహుబలి నాలుగు బాషల రైట్స్ కొనుకున్నారు అక్కడి డిస్ర్టిబ్యూటర్లు. ఇప్పటికే అమెరికాలో ఒక సింగిల్ లాంగ్వేజ్ లో అత్యధిక వసూళ్ళు అంటే మాత్రం మన దంగల్ సినిమా గురించి చెప్పాలి. ఆ సినిమా 12 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. తెలుగులో అయితే బాహుబలిః ది బిగినింగ్ 6 మిలియన్ డాలర్ల క్లబ్బులోకి ఎంటర్ అయ్యింది. అయితే ఇప్పుడు తెలుగులో 6 మిలియన్ హిందీలో 6 మిలియన్.. తమిళ మరియు మలయాళంలు కలుపుకుని ఒక 3 మిలియన్ డాలర్ల క్లబ్బులోకి ఎంట్రీ ఇస్తేనే.. అప్పుడు 15 మిలియన్ డాలర్లు వస్తాయ్. అలా జరిగితేనే అక్కడి పంపిణీదారులు సేఫ్ అవుతారు. మరి బాహుబలి ఆ ఫీట్ సాధిస్తుందా అనేది మనం చూడాల్సిన అంశం.

అయితే దంగల్ రేంజులో హిట్టయ్యే స్టామినా ఉన్న బాహుబలి ఖచ్చితంగా 15 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని అంటున్నారు విశ్లేషకులు.

,  ,  ,  ,  ,  ,