Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-May-2015 11:19:54
facebook Twitter Googleplus
Photo

'బాహుబలి' విడుదలకి ముందే అనేక రికార్డులను సొంతం చేసుకుంటూ వస్తోంది. తాజాగా ఆ రికార్డుల జాబితాలోకి 'ఆడియో ఫంక్షన్ టెలీకాస్ట్ రైట్స్' విషయం కూడా చేరిపోయింది. కోటి రూపాయల రేటుకి ఈ సినిమా ఆడియో ఫంక్షన్ రైట్స్ ని tv 5 ఛానల్ వారు దక్కించుకున్నట్టుగా సమాచారం. తెలుగు .. తమిళ .. హిందీ పరిశ్రమలకి సంబంధించిన అతిరథ మహారథుల సమక్షంలో ఈ నెల 31న ఈ సినిమా ఆడియో వేడుక జరగనుంది. ఇదే వేదికపై ఈ సినిమా ట్రైలర్ ని కూడా లాంచ్ చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ ఫంక్షన్ ప్రత్యక్ష ప్రసార హక్కుల కోసం టీవీ ఛానల్స్ పోటీపడ్డాయి. కోటి రూపాయలు చెల్లించి tv 5 ఛానల్ వారు ఈ రైట్స్ ను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒక ఆడియో ఫంక్షన్ టెలీకాస్ట్ రైట్స్ ఈ స్థాయిలో అమ్ముడవడం నిజంగా విశేషమే. అందుకే ఇది బాహుబలి సాధించిన మరో రికార్డ్ గా చెబుతున్నారు.

,  ,  ,  ,  ,  ,