Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-May-2017 09:58:58
facebook Twitter Googleplus
Photo

ఓవైపు బాహుబలి: ది కంక్లూజన్.. మరోవైపు దంగల్.. ప్రపంచ స్థాయిలో ఇండియన్ సినిమా పేరు మార్మోగిపోయేలా చేస్తున్నాయి. బాహుబలి-2 మీద ముందు నుంచే భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా రూ.1000 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ సినిమాగా రికార్డు సృష్టిస్తుందన్నది అందరూ ఊహించిన విషయమే. ఐతే బాహుబలి-2 అంచనాల్ని మించిపోయింది. ఫుల్ రన్లో కాదు.. తొలి వారంలోనే రూ.1000 కోట్ల మార్కును దాటేసింది. రూ.1500 కోట్ల మార్కు మీద కన్నేసింది. నిజంగా ఈ మైలురాయి అందుకుంటుందా అన్న సందేహాలకు తెరదించుతూ.. ఆ మైలురాయిని కూడా దాటేసింది బాహుబలి-2. శుక్రవారం.. అంటే విడుదలైన 22వ రోజు బాహుబలి: ది కంక్లూజన్ వరల్డ్ వైడ్ రూ.1500 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును అందుకుంది.

ఐతే ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2 సాగిస్తున్న ప్రభంజనం కంటే.. చైనాలో అమీర్ ఖాన్ సినిమా దంగల్ సృష్టిస్తున్న ప్రకంపనల గురించి ఇంకా ఎక్కువగా చెప్పుకోవాలి. ఇండియాలో రిలీజైన నాలుగు నెలల తర్వాత చైనాలో విడుదలైన ఈ చిత్రం.. రెండు వారాల్లోనే ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. ఇప్పటిదాకా ఈ చిత్రం చైనాలో 78 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయడం అనూహ్యం. వీకెండ్లలోనే కాదు.. వీక్ డేస్ లో కూడా దంగల్ ప్రభంజనం సాగిస్తోంది. సోమవారం నుంచి గురువారం వరకు నాలుగు రోజుల్లో ఈ సినిమా 16 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం. దంగల్ ఓపెనింగ్స్ ఎంత బావున్నప్పటికీ మహా అయితే రూ.200 కోట్లు వసూలు చేస్తే ఎక్కువ అనుకున్నారు.

,  ,  ,  ,  ,