Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Feb-2017 11:44:12
facebook Twitter Googleplus
Photo

బాహుబలి సిరీస్ లో రెండో భాగంగా వస్తున్న బాహుబలి ది కంక్లూజన్ పై.. దేశవ్యాప్తంగా అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ మూవీపై పెట్టిన బడ్జెట్.. థియేట్రికల్ రైట్స్ కొనుకున్న డిస్ట్రిబ్యూటర్స్.. అందరూ సేఫ్ జోన్ లోకి వచ్చేందుకు వీలుగా.. సమ్మర్ ను ఆక్యుపై చేసేసింది బాహుబలి2.

ఏప్రిల్ 28న బాహుబలి2 రిలీజ్ కానుండగా.. దీనికి అటూ ఇటూ సినిమాలను రిలీజ్ చేసేందుకు ఎవరూ సాహసించడం లేదు. కానీ.. డిఫరెంట్ మూవీస్ తో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నిఖిల్ మాత్రం.. తన కొత్త సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయడం ఖాయం అంటున్నాడు. సుధీర్ వర్మ డైరెక్షన్ లో రూపొందిన కేశవ అనే చిత్రాన్ని ఇప్పటికే కంప్లీట్ చేయగా.. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్నాడు కేశవ.

బాహుబలి2 ఉన్నా సరే.. ఈ చిత్రం ఔట్ పుట్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న నిర్మాత అభిషేక్ నామా.. సమ్మర్ లో కేశవ రిలీజ్ ను కన్ఫాం చేస్తున్నారు. నిఖిల్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా ఈ థ్రిల్లర్ నిలుస్తుందని చెబుతున్నారాయన. రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో.. పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఇషా కొప్పికర్ టాలీవుడ్ రీఎంట్రీ ఇవ్వనుంది.

,  ,  ,  ,  ,  ,