Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jul-2015 15:47:57
facebook Twitter Googleplus
Photo

ఎన్నో విశేషాలతో .. మరెన్నో ప్రత్యేకతలతో 'బాహుబలి' సినిమా రూపొందింది. కథ .. కథనం .. తారాగణం .. చిత్రీకరణ ఇలా ప్రతి విషయంలోనూ విశిష్టతను సంతరించుకుంటూ తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 5000 థియేటర్లకి పైగా విడుదల కాబోతోంది.


అందుకు ఈ నెల 10వ తేదీని ముహూర్తంగా నిర్ణయించడంతో, ఆయా ప్రాంతాల్లోని తెలుగువారంతా ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోను ఈ సినిమా భారీగా సందడి చేయనుంది. తమిళ .. మలయాళ .. హిందీ వెర్షన్ ల సంగతి అటుంచితే, ఒక్క తెలుగు భాషలోనే ఈ సినిమా అక్కడ 130 పైగా స్క్రీన్స్ పై విడుదల కానుంది. భారతీయ సినిమా భారీతనానికి నిదర్శనంగా నిలుస్తోన్న ఈ సినిమా కోసం, ఆయా ప్రాంతాల్లోని సినీదిగ్గజాలు సైతం ఎదురుచూస్తూ వుండటం విశేషం.

,  ,  ,  ,  ,