Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Feb-2017 11:23:47
facebook Twitter Googleplus
Photo

ప్రతీ టెక్నీషియన్ లోనూ ప్రేక్షకుడు వుంటాడు. తను ఆ సినిమాలో పనిచేస్తున్నంత మాత్రాన విషయం లేకపోయినా ఆ సినిమా విజయం సాధిస్తుందని అనుకోడు. అలానే తన సినిమాపై అమిత నమ్మకంతో ఉన్నామంటే అది కేవలం సినిమాకి పనిచేసిన కారణం కాదు.

ఈ వివరణ ఇప్పుడెందుకు అంటే సీనియర్ యాక్టర్ నరేష్ నటించిన శతమానం భవతి సినిమా పంపిణీదారుల లాభాల వాటా పరంగా చూస్తే సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. అందులో ఆయన పోషించిన కాంగ్గారాజు పాత్ర అందరినీ నవ్వించింది. ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధిస్తుందని ఆయనకు ముందే తెలుసంట. అయితే సొంత వ్యక్తులే దాన్ని నమ్మలేదని తెలుపడం విశేషం.

శతమానం భవతి సినిమా సూపర్ హిట్ అవుతుందని సంక్రాంతి విజేత అవుతుందని ముందే అనుకున్నా. అయితే ఈ విషయాన్ని చెబితే నా సొంత పి.ఆర్.ఓ లే నమ్మక నవ్వుకున్నారని నరేష్ తన ట్విట్టర్ అకౌంట్ లో వెల్లడించడం గమనార్హం.

,  ,  ,  ,  ,  ,