Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-May-2017 13:46:33
facebook Twitter Googleplus
Photo

బాహుబలి: ది కంక్లూజన్ విడుదలై రెండున్నర వారాలు దాటింది. అయినా ఆ సినిమా జోరేమీ తగ్గలేదు. మూడో వారాంతంలో సైతం ఈ సినిమా హౌస్ ఫుల్ వసూళ్లతో నడవడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. దేశమంతటా బాహుబలి-2 జోరు కొనసాగుతోంది. ఈ శని.. ఆదివారాల్లో బాహుబలి-2 థియేటర్లు కళకళలాడాయి. ఫస్ట్ షో.. సెకండ్ షోలకు టికెట్లు దొరకని పరిస్థితి. ఇంకా ఒక్కసారీ సినిమా చూడని వాళ్లూ చూస్తున్నారు.. ఆల్రెడీ సినిమా చూసిన వాళ్లూ థియేటర్లకు వస్తున్నారు. తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ కొత్త సినిమాలేవీ బాహుబలి-2 ముందు నిలవలేని పరిస్థితి కనిపిస్తోంది.

ఈ శుక్రవారం రిలీజైన రాధ సినిమా తొలి రోజు బాగానే వసూళ్లు రాబట్టింది కానీ.. రెండో రోజుకు జోరు తగ్గింది. వెంకటాపురం పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. రక్షక భటుడు గురించి మాట్లాడటానికి ఏమీ లేదు. ఈ కొత్త సినిమాల కంటే కూడా బాహుబలి-2 థియేటర్లలోనే ఎక్కువ జనాలు కనిపిస్తున్నారు. కలెక్షన్లు వస్తున్నాయి. ఐతే తెలుగు సినిమాల పరిస్థితే కొంచెం నయం కానీ.. హిందీలో అయితే బాహుబలి-2 ధాటికి కొత్త సినిమాలు అస్సలు నిలవలేకపోయాయి. రామ్ గోపాల్ వర్మ సర్కార్-3 పూర్తి డివైడ్ టాక్తో మొదలై.. రెండో రోజుకే వీక్ అయిపోయింది. దీంతో పాటు రిలీజైన మేరి ప్యారి బిందు పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. దానికి ఓపెనింగ్స్ కూడా లేవు.

,  ,  ,  ,  ,